Switch to English

జగన్‌ సారూ.. ‘కోటి’ సరే, ఈ శతకోటి ప్రశ్నల సంగతేంటి.?

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఎపిసోడ్‌కి సంబంధించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఇది నిజంగానే స్వాగతించాల్సిన విషయం. అయితే, ఇంతటి దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ సంస్థపై ముఖ్యమంత్రి ఎందుకు తీవ్రంగా స్పందించలేకపోయారు.? ‘ఎల్జీ పాలిమర్స్‌ అనేది మల్టీ నేషనల్‌ కంపెనీ. చాలా బాగా పనిచేసే కంపెనీ. అలారం ఎందుకు మోగలేదు? అన్నది నాకూ అనిపిస్తోంది..’ అంటూ చాలా సున్నితంగానే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

లాక్‌డౌన్‌ అమల్లో వున్నా, ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించే ఫ్యాక్టరీల్లో మెయిన్‌టెనెన్స్‌ తప్పనిసరి. అలాంటప్పుడు, లాక్‌డౌన్‌ నేపథ్యంలోనే ‘రసాయనం’ నిల్వ వుండిపోవడం, వేడికి అది లీక్‌ అవడం జరిగిందంటూ యాజమాన్యం ప్రకటించడమేంటి.? ఇక్కడ యాజమాన్యం తప్పిదం సుస్పష్టం. దాన్ని ప్రభుత్వం ఎందుకు ‘కవర్‌’ చేయాలని చూస్తోందన్నదే ఎవరికీ అర్థం కావడంలేదు. ఇదిలా వుంటే, ‘కోటి’ ఎక్స్‌గ్రేషియాపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి, ఆ కోటి రూపాయల మొత్తాన్నీ కంపెనీ నుంచే వసూలు చేయాలి. ఆ మాటకొస్తే, ప్రమాదకర రసాయనాలతో పరిశ్రమలు నడిపే సంస్థలు, ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగితే.. భారీ స్థాయిలో ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సి వస్తుంది. ఇందుకోసం పెద్దయెత్తున ఇన్స్యూరెన్స్‌ సౌకర్యాన్నీ కలిగి వుంటారు. ఒక్కో మరణానికీ 5 కోట్ల వరకూ ఎక్స్‌గ్రేషియా ఇచ్చే స్థాయిలో ఇన్స్యూరెన్స్‌ వుంటుందని నిపుణులు చెబుతుండడం గమనార్హం.

మరోపక్క, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రభుత్వాలు సదరు కంపెనీల నుంచి భారీ స్థాయిలో నష్ట పరిహారాల్ని వసూలు చేయాల్సి వుంటుంది. కానీ, ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఇప్పటిదాకా స్పందించకపోవడం ఆశ్చర్యకరమే. అత్యవసరం కాకపోయినా, ఎల్జీ పాలిమర్స్‌కి స్థానిక యంత్రాంగం లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చిందా.? గత కొంతకాలంగా ఈ సంస్థపై ఫిర్యాదులు చేస్తున్నామని స్థానికులు చెబుతున్న మాట నిజమైతే, అధికారులు ఎందుకు స్పందించలేదు.? ఇలా చాలా ప్రశ్నలు దాగి వున్నాయి.

వాటికి సమాధానం చెప్పలేకనే, భారీ స్థాయిలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందనే విమర్శలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. ఇంతటి దుర్ఘటనను మించిన దారుణం ఏంటంటే, అధికార పార్టీ.. ఈ ఘటనతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తుండడం. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే వస్తుంది.. ఇంతటి పబ్లిసిటీ.. అన్నట్లు అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. శవ రాజకీయాలకు పరాకాష్ట ఇది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

‘పింజ్రాతోడ్‌’ యువతుల అరెస్ట్‌

గృహ హింసకు గురి అవుతున్న బాలికలను రక్షించి స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న హోంకు తరలిస్తూ అందరి ధృష్టిని ఆకర్షించిన పింజ్రాతోడ్‌ సంస్థ నిర్వాహకులు అయిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రస్తుతం...

కరోనా టైంలో సైలెంట్ గా వ్యభిచారం చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా??

ప్రస్తుతం దేశం లాక్ డౌన్ లో ఉంది. కరోనా భయంతో వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ప్రజలు భయపడుతూనే ఇళ్లలోంచి బయటకు వస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరినీ తాకకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. దగ్గు,...

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

ఫైర్ యాక్సిడెంట్: సికింద్రాబాద్ లో బూడిదైన 10 గుడిసెలు.!

తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో...

బ్రేకింగ్ న్యూస్: నల్గొండలో భారీ పవర్ ప్లాంట్ బ్లాస్ట్.!

గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీని వలన తాజాగా తెలంగాణ, నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి...