బడ్జెట్ సమావేశాల లోపే జగన్ అలా చేయబోతున్నాడా?

వితండవాదం: రాజధాని.. రాజ్యాంగంలో రాసి వుందా.?

వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలు దాదాపుగా నెల రోజులపాటు జరిగే అవకాశం ఉన్నది. దీనికంటే ముందు జగన్ అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పై బాబు కీలక నేరస్తుడిగా రుజువు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద నుంచి ఇప్పటికే రెండువేల కోట్ల రూపాయలు ఐటి శాఖ దాడుల్లో దొరికినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఒక్క పీఎస్ దగ్గరే ఈ స్థాయిలో దొరికితే బాబు దగ్గర, అతని అనుచరుల వద్ద ఇంక ఏ స్థాయిలో డబ్బు ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే దాడులు చేయడానికి ఐటి శాఖ సిద్ధం అవుతున్నది. దీంతో పాటుగా బడ్జెట్ సమావేశాల అనంతరం మూడు రాజధానుల విషయాన్ని కూడా ఓ కొలిక్కి తీసుకురాబోతున్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తైన తరువాత విశాఖకు కార్యనిర్వాహక రాజధాని మార్పు ఉంటుంది.

అలానే ఈ బడ్జెట్ సమావేశాల లోపే జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదేమంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది ఈ బడ్జెట్ సమావేశాల లోపుగా జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానితో జరిగిన సమావేశంలో ఏ విషయం గురించి కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. అందుకే జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా దొరికినట్టు తెలుస్తోంది.

ఈరోజున జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. అమిత్ షాతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. ఎన్డీఏలో చేరే విషయంపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే పవన్ పరిస్థితి ఏంటి. పవన్ ఇప్పటికే ఎన్డీఏతో కలిసి ఉన్నారు. బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలో జగన్ కూడా ఎన్డీయేలో చేరితే…జనసేన పార్టీ వైకాపాతో కలిసి పనిచేస్తుందా…? లేదంటే పవన్ ఎన్డీయే నుంచి తిరిగి బయటకు వస్తారా?