వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. ట్విటర్ హ్యాండిల్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆస్తులను దోచుకుంటూ, అవినీతి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పి, అధికారంలోకి వచ్చాక మాత్రం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం పెద్ద అన్యాయం అన్నారు. 2019కి ముందు మీరు మూడు సార్లు సీఎంగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదని గుర్తు చేశారు. కానీ తాను 5 ఏళ్లలోనే 17 కొత్త కాలేజీలు ప్రారంభించామని, వాటిలో 5 ఇప్పటికే క్లాసులు మొదలై, 800 కొత్త ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. మిగిలిన కాలేజీలను ముందుకు తీసుకెళ్లకుండా ప్రైవేట్ వారికి అప్పగించడం అవినీతికి నిదర్శనమని జగన్ మండిపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సీట్లు 2,360 నుంచి 4,910కి పెరగాల్సిందని, దీని వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు చవకగా వైద్య విద్య లభించేదని తెలిపారు. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల తమ పిల్లలను డాక్టర్లుగా చేయాలనుకునే తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి విదేశాలకు పంపుతున్న స్థితి వస్తోందని, ఇలాంటి సమయంలో పులివెందుల కాలేజీకి కూడా సీట్లు వద్దని లేఖ రాయడం కుట్రేనని అన్నారు.
కొత్త కాలేజీలు ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేస్తాయని, ఉచిత సేవలు ప్రజలకు అందుతాయని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం కమీషన్ల కోసం ప్రజల ఆస్తులను పందేరం పెడుతున్నారని ఆరోపించారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చంద్రబాబు నాశనం చేశారని, 15 నెలల్లో ఇవ్వాల్సిన రూ.4,500 కోట్లలో రూ.600 కోట్లు మాత్రమే ఆస్పత్రులకు చెల్లించారని, మిగిలిన రూ.4,000 కోట్లను ఎగ్గొట్టారని తెలిపారు. వైద్యం కోసం పేదవాడి భద్రతను దెబ్బతీశారని ఆరోపించారు. అంతేకాకుండా “ఆరోగ్య ఆసరా’’ పథకాన్ని కూడా సమాధి చేశారని జగన్ అన్నారు.
ప్రభుత్వం చేసే పనిని ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇస్తారు? కోవిడ్ లాంటి సమయంలో బీమా కంపెనీలు వెనక్కి తగ్గినా, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఉచిత చికిత్స అందించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉండదని, ప్రీమియం పేరుతో తమవాళ్ల కంపెనీలకు లాభాలు చేకూర్చడమే చంద్రబాబు లక్ష్యమని జగన్ అన్నారు.
ప్రజలు చంద్రబాబును క్షమించరని, తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేసి, మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తీసుకువస్తామని జగన్ ప్రకటించారు.
1.@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం… pic.twitter.com/oBXj40vmOP
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025
