ఎవరు.? మూడు రాజధానులన్నదెవరు.? మళ్ళీ ఒకటే రాజధాని అంటున్నదెవరు.? ఇంకెవరు.. అన్నీ ఆయనే చెబుతారు. మాట తప్పనంటారు, మడమ తిప్పబోనంటారు. కానీ, మాట తప్పుతారు.. ఎడా పెడా మడమ తిప్పేస్తారు. దటీజ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ప్రతిపక్షంలో వున్నప్పుడేమో అమరావతే రాజధాని.. అధికారంలోకి వచ్చాకేమో, అది కమ్మరావతి.! అందుకే, మూడు రాజధానులు.! ఇప్పుడేమో మళ్ళీ ఒకటే రాజధాని. అదే విశాఖపట్నం. ‘నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవబోతున్నా..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన.
ఏదీ, సీపీఎస్ రద్దు చేస్తాం.. అన్నట్టుగానే విశాఖను రాజధాని చేస్తామన్న ప్రకటనను చూడాలా.? అంతేనేమో.. అలాగే అనుకోవాలేమో.!
ముఖ్యమంత్రిగా అధికార పీఠమెక్కాక.. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని ఏది.? అంటే, సమాధానం చెప్పలేని దుస్థితి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. ప్రస్తుతానికైతే అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని. కొన్ని రోజుల్లో.. కొన్ని నెలల్లో విశాఖ రాజధాని కాబోతోందంటూ ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఎలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటల్ని నమ్మేది.? ఓ వైపు రాజధాని విషయమై కోర్టుల్లో పలు కేసులు విచారణ దశలో వున్నాయి. అవి తేలితే తప్ప, రాజధాని వ్యవహారం ఓ కొలిక్కి రాదు.
కానీ, త్రీ క్యాపిటల్స్ నాటకాన్ని రక్తికట్టిస్తూనే వున్నారు. ఇంతలోనే, విశాఖ రాజధాని అంటున్నారు. అమరావతికి వెన్నుపోటు పొడిచారు సరే.. కర్నూలుకి కూడా వెన్నుపోటు పొడిచినట్టేనా.? అంతేనేమో.!