Switch to English

ఆ విషయంలో జగన్‌, చంద్రబాబు సేమ్ టు సేమ్.!

చంద్రబాబు హయాంలో పోలీస్‌ బాస్‌ (డీజీపీ)లుగా పనిచేసిన పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు తీవ్ర రాజకీయ విమర్శల్ని ఎదుర్కొన్న విషయం విదితమే. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత డీజేపీ గౌతమ్ సవాంగ్‌కి కూడా ఎదురవుతోంది.

నిజానికి గౌతమ్ సవాంగ్‌ సీనియర్‌ మోస్ట్‌ ఐపీఎస్‌ అధికారి మాత్రమే కాదు, చాలా సిన్సియర్‌ పోలీస్‌ అధికారిగా కూడా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు హయాంలోనూ గౌతమ్ సవాంగ్‌ పనితీరుకి విపక్షాల నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది.

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటన నేపథ్యంలో, ప్రభావిత ప్రాంతంలో ఇటీవల గౌతమ్ సవాంగ్‌ పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో స్థానికుల నుంచి డీజీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసు విచారణ, తదితర అంశాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సహజంగా ఇలాంటి విషయాల్లో విపక్షాలకు చెందిన మద్దతుదారులు అత్యుత్సాహం చూపుతుంటారు. ఇక్కడా అదే జరుగుతోంది.

మరోపక్క, అధికార పార్టీ నుంచి వివిధ అంశాలపై వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి వేగంగా స్పందిస్తోన్న పోలీస్‌ యంత్రాంగం, విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోవడంలేదన్న విమర్శలూ లేకపోలేదు. ప్రధానంగా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం విషయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖ, అధికార పార్టీ మద్దతుదారులపై ఒకలా, విపక్షాలకు చెందిన మద్దతుదారులపై ఇంకోలా వ్యవహరిస్తోందన్న వాదనలు గట్టిగా విన్పిస్తున్నాయి.

‘చట్టం దృష్టిలో అందరూ సమానమే..’ అని పోలీస్‌ శాఖ చెబుతున్నా, చట్టం ముందు కొందరు ఎక్కువ సమానం.. అన్న విషయం స్పష్టమవుతూనే వుంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విపక్ష నేతలు బయట తిరగలేని పరిస్థితులు నెలకొంటే, అధికార పార్టీ నేతలు స్వేచ్చగా విహరిస్తూ.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారనీ, పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న విషయం విదితమే.

పోలీస్‌ శాఖపై రాజకీయ ఒత్తిళ్ళు ఇప్పుడు కొత్తగా కన్పిస్తున్నవేమీ కావు. ఎవరు అధికారంలో వున్నాసరే, పోలీస్‌ శాఖకి.. ‘అందరూ సమానమే’ అనాలంటే అది కత్తి మీద సాములాంటి వ్యవహారమే. ఇక్కడ గౌతవ్‌ు సవాంగ్‌ ప్లేస్‌లో మరో అధికారి వున్నా.. ఇదే పరిస్థితి దాపురిస్తుంటుంది. ఎందుకంటే, అధికారంలో వున్నవారి ‘వాడకం’ అలా వుంటుంది మరి. సో, ఎలా చూసుకున్నా.. పోలీస్‌ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్ళకు సంబంధించి చంద్రబాబు, వైఎస్‌ జగన్‌.. సేమ్ టు సేమ్ అని చెప్పక తప్పదేమో.!

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

షాకింగ్: వలస కూలీ ఆకలి కేక.. చచ్చిన కుక్కను తింటూ.!

దేశంలో కరోనా వైరస్ కంటే వలస కూలీల కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ట్రాన్స్ పోర్ట్ లేక ఎంతోమంది కాలిబాటన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామలకు...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను కలిగించేలా సినిమా ఆఫీస్‌ లను ఫిల్మ్‌...

ప్రభాస్‌ 21 : బాబోయ్‌ దీపిక అంత డిమాండ్‌ చేసిందా?

ప్రభాస్‌ ప్రస్తుతం తన 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ప్రభాస్‌ 21వ...

క్రైమ్ న్యూస్: మృతదేహాల పోస్టుమార్టంలో కీలక సమాచారం లభ్యం.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో జరిగిన ఆత్మహత్యల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బావిలో బయటపడిన 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో మరింత ప్రకంపనలు రేపింది....

గుడ్ న్యూస్: పోస్ట్ ప్రొడక్షన్ కి గ్రీన్ సిగ్నల్, షూటింగ్స్ పై త్వరలోనే నిర్ణయం.!

కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి...