Switch to English

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారతీయ ప్రజల ప్రేమ, ఓర్పునకు ఇదో అందమైన ఫీట్ అని ఆమె అభివర్ణించారు. ఆ బాలిక సాహసాన్ని ఇవాంకా ప్రశంసించగా.. నెటిజన్లు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యమని నిప్పులు చెరిగారు. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నుంచి సాధారణ ప్రజల వరకు పలువురు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ కోట్లాది మంది వలస కార్మికుల పాలిట విలన్ గా మారిన సంగతి తెలిసిందే.

ఉన్నచోట పనిలేక, అక్కడే పస్తులుండలేక మూటా ముల్లె సద్దుకుని కాలినడకన వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఊరు బాట పట్టారు. అలాగే బీహార్ లోని దర్బంగాకు చెందిన మోహన్ పాశ్వాన్ గుర్గావ్ లో రిక్షా కార్మికుడిగా పని చేస్తున్నాడు. లాక్ డౌన్ ముందు జరిగిన ఓ ప్రమాదంలో గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. ఈ లోగా లాక్ డౌన్ రావడంతో అటు ఆదాయం లేక, ఇటు అక్కడే ఉండలేక సతమతమయ్యాడు. పోనీ ఇంటికెళ్లిపోదామంటే ఎలాంటి రవాణా వసతీ లేదు. మిగిలిన వలస కార్మికుల్లా నడిచే పరిస్థితి కూడా లేదు. దీంతో ఆయన కుమార్తె 15 ఏళ్ల జ్యోతి కుమారి సైకిల్ పై తండ్రిని తీసుకుని ఇంటికెళ్దామని నిర్ణయించుకుంది. కొంతమంది అలాంటి సాహసం వద్దని చెప్పినా ఆమె వినలేదు. తండ్రిని సైకిల్ పై వెనకాల కూర్చోబెట్టుకుని ఈనెల 10న గుర్గావ్ లో బయలుదేరింది. కొన్నిచోట్ల ట్రక్ డ్రైవర్ల లిప్ట్ తీసుకుని మొత్తమ్మీద ఏడు రోజుల్లో దాదాపు 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈనెల 16న సొంతూరు చేరారు. ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు.

అయితే, ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇవాంకా ట్రంప్ జ్యోతిపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు జ్యోతి తెగువకు ఫిదా అయిన భారత సైక్లింగ్ ఫెడరేషన్ ఆమెకు మంచి అవకాశం ఇచ్చింది. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే ట్రయల్స్ లో పాల్గొనమని ఆహ్వానించింది. ఆమె ప్రయాణ ఖర్చులను కూడా తామే భరిస్తామని స్పష్టంచేసింది. ఆ ట్రయల్స్ లో గెలిస్తే, జ్యోతిని జాతీయ సైక్లింగ్ అకాడమీలో చేర్చుకుని శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బర్త్‌డే స్పెషల్‌: పడి లేచిన కెరటంలా దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్

తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎప్పటికి గుర్తుండి పోయే నందమూరి తారక రామారావు వారసత్వంతో బాల నటుడిగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌ చిన్న తనంలోనే రాముడిగా నటించి నిజంగా రాముడు ఇలాగే...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

క్రైమ్ న్యూస్: అంకుల్‌తో కలిసి అమ్మే నాన్నను చంపేసిందని చెప్పిన 12 ఏళ్ల బాలుడు

అక్రమ సంబంధాలు ఎంతటి దారుణంకు ఒడిగట్టేందుకు అయినా ఉసిగొల్పుతాయని మరోసారి నిరూపితం అయ్యింది. హైదరాబాద్‌ లాలా పేటకు చెందిన నాగభూషణం ఇటీవల మృతి చెందాడు. ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లుగా భావించి...

గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై...