స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కృష్ణ అండ్ హిస్ లీల. ఐదేళ్ల క్రితం 2020 కరోనా టైం లో డైరెక్ట్ ఓటీటీ రిలీజైన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయ్యింది. సినిమా టైటిల్ ని ఇట్స్ కాంప్లికేటెడ్ గా మార్చి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను రవికాంత్ పెరెపు డైరెక్ట్ చేయగా దగ్గుబాటి రానా, సంజయ్ రెడ్డి నిర్మించారు. సినిమాలో సిద్ధుతో పాటుగా శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు డైరెక్టర్ రవికాంత్ పెరెపు, హీరో సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత రానా. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రవికాంత్, సిద్ధుతో మరో సినిమా చేయాలనుకోగా ఈ సినిమా రిలీజ్ చేస్తేనే గానీ మరో మూవీ చేయమని చెప్పారు అందుకే ఈ సినిమా ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తున్నామని అన్నారు రానా. ఇది రీ రిలీజ్ కాదు థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్ అని అన్నారు. స్టార్ బాయ్ సిద్ధు మాట్లాడుతూ.. ఈ సినిమాను థియేటర్స్ లో ఆడియన్స్ తో కలిసి చూడాలని నా స్ట్రాంగ్ ఫీలింగ్. 14న రిలీజ్ సరైనదే.. ఈ సినిమా ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ చూడాలని ఉందని అన్నారు.
లాక్ డౌన్ లో సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజైంది. ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నానని డైరెక్టర్ రవికాంత్ పెరెపు అన్నారు. ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది ఈ సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్.. అందరు రిలేట్ చేసుకునేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు డైరెక్టర్ రవికాంత్ పెరెపు.
ఈ సినిమాకు ముందు వేరే టైటిల్ అనుకున్నాం.. ఆ టైటిల్ పెట్టనివ్వలేదు. అందుకే ఇట్స్ కాంప్లికేటెడ్ అని దర్శకుడు రవికాంత్ ఫిక్స్ చేశారు. థియేటర్ లో ఈ సినిమాను అందరితో కలిసి చూడటం మంచి ఫీలింగ్ అని.. ఇది రీ రిలీజ్ కాదు.. కానీ ఇది థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్ అని అన్నారు రానా.
తనకు అర్ధమయ్యేవి కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే.. అందులో ఈ సినిమా ఒకటి. చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు కాబట్టే సినిమా నచ్చిందని అన్నారు రానా. అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు రానా దగ్గరికి తీసుకొస్తారు. వాటిని అర్ధం చేసుకుని రానా ముందుకు తీసుకెళ్తాడు. ఈ సినిమా రానాకి కనెక్ట్ అయింది. ఈ సినిమా ముందే థియేటర్స్ లో రిలీజ్ అయ్యుంటే సిక్స్ టైంస్ ఎక్కువ వచ్చేదని అన్నారు సిద్ధు జొన్నలగడ్డ.
వాలెంటైన్స్ డే ఈ సినిమాకు పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అని రానా అన్నారు. థియేటర్స్ లో ఈ సినిమా చూడాలన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని సిద్ధు అన్నారు. ఇక కథల ఎంపికలో తన స్టైల్ గురించి రానా చెప్పారు. కథ ఎందుకు చెబుతున్నాం అన్నది చూసి.. తర్వాత కథ ఎంత కొత్తగా ఉందన్నది చూస్తానని అన్నారు రానా.