అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాల మీదే కాక ప్రస్తుతం సీరియస్ సబ్జెక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టాడు. గతేడాది విడుదలైన హార్డ్ హిట్టింగ్ డ్రామా నాంది ఆ కోవకు చెందిన సినిమానే. ఈ చిత్రం ద్వారా బౌన్స్ బ్యాక్ అయిన నరేష్ మరోసారి సీరియస్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు.
అల్లరి నరేష్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈరోజు తన తర్వాతి చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. దెబ్బలతో ఉన్న నరేష్ పోస్టర్ ను మనం చూడొచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆనంది నటిస్తోంది. అబ్బూరి రవి కథను అందించాడు.
ఏఆర్ మోహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకల సంగీతాన్ని అందిస్తున్నాడు.