Switch to English

ఇస్మార్ట్‌ కవరింగ్‌: అదంతా షూటింగ్‌ కోసమే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,927FansLike
57,764FollowersFollow

యంగ్‌ హీరో రామ్‌ పోతినేని, తన తాజా చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ షూటింగ్‌ సందర్భంగా పబ్లిక్‌లో స్మోక్‌ చేసినందుకుగాను పోలీసులకు 200 రూపాయల జరీమానా కట్టాల్సి వచ్చింది. పబ్లిక్‌లో స్మోకింగ్‌ చేయడంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెల్సిందే. మరి, రామ్‌ ఎందుకలా చేశాడు? అంటే, దానికి భలే కవరింగ్‌ ఇచ్చాడు ఈ ఇస్మార్ట్‌ రామ్‌.

‘అది షూటింగ్‌ సమయంలో స్మోక్‌ చేస్తుండగా జరిగిన విషయం. షూటింగ్‌ బ్రేక్‌లో కాదు..’ అంటూ రామ్‌ తనదైన స్టయిల్లో సోషల్‌ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. ‘నా టైము, పబ్లిక్‌ టైము వేస్ట్‌ చెయ్యడం ఇష్టం లేక రెస్పాండ్‌ గాలే.. షూట్‌ల కాల్చిన తమ్మి.. బ్రేక్‌ల కాద్‌.. టైటిల్‌ సాంగ్‌ల చూస్తావ్‌గా స్టెప్పు.. ఫిర్‌ భి లా కి ఇజ్జత్‌ ఇచ్చి ఫైన్‌ కట్టినమ్‌. గిప్పఉడు నువ్వు కూడా నా లెక్క లైట్‌ తీసుక్కో పనిచేస్కో – ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అంటూ రామ్‌ పోతినేని ట్విట్టర్‌లో పక్కా హైదరాబాదీ స్టయిల్‌ వివరణ ఇచ్చాడు.

పోలీసులు, షూటింగ్‌ బ్రేక్‌లో రామ్‌ స్మోకింగ్‌ చేశాడంటూ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. హీరో రామ్‌ మాత్రం.. అదంతా ఉత్తదేనంటున్నాడు. ఏది నిజం.? పోలీసులే సమాధానం చెప్పాలేమో. అయినా షూటింగ్‌ సందర్భంగా స్మోక్‌ చేస్తే, పోలీసులు ఫైన్‌ విధిస్తారా.? అనే ప్రశ్న కూడా విన్పిస్తోంది.

ఏదిఏమైనా, ఈ వివాదం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకి పబ్లిసిటీ పరంగా భలేగా కలిసొచ్చింది. వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్స్‌ పోటీల కారణంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు. మరీ ఎక్కువ టైమ్‌ కాదు, జస్ట్‌ ఆరు రోజులు మాత్రమే. ఇంతలోనే ఈ వివాదం, సినిమాకి పబ్లిసిటీ పరంగా భలే ఊపు తీసుకొచ్చిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే.

9 COMMENTS

సినిమా

Chiranjeevi: ‘దటీజ్ మెగాస్టార్..’ ఊర్వశి రౌతేలా కుటుంబానికి చిరంజీవి సాయం..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబానికి చేసిన సాయం జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని నటి ఊర్వశి రౌతేలా అన్నారు. ఊర్వశి రౌతేలా తల్లికి చిరంజీవి వైద్య...

బాయ్ కాట్ లైలా కాదు వెల్కం లైలా అనండి..!

విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్ ఇండస్ట్రీ పృధ్విరాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. సినిమాలో...

విజయ్ కింగ్ డమ్.. ఈ తికమక ఏంటి..?

విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్ డమ్ టీజర్ లేటెస్ట్ గా రిలీజైన విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను...

ప్రభాస్ ఫౌజీలో అనుపమ్ ఖేర్..!

రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ...

త్రివిక్రమ్.. అట్లీ.. ముందు ఎవరితో..?

పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో కూడా ఫ్యాన్స్...

రాజకీయం

మాజీ మంత్రి రోజాకు చెక్ పెడుతున్న వైసీపీ

తిరుపతి జిల్లాలోని నగరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆయన ఏ...

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకారం..!

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకరించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ తైవాన్ సహకారం కోరారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్...

ఎట్టకేలకు ’జిత్తులమారి‘ వల్లభనేని వంశీ అరెస్ట్.!

వైసీపీ హయాంలో అయితే రాజకీయ ప్రత్యర్థుల్ని ఎడా పెడా అరెస్టులు చేసెయ్యడం చూశాం. ఈ క్రమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి తరచూ కోర్టు నుంచి మొట్టికాయలు పడుతుండేవి. అరెస్టులు చేయడం, కస్టోడియల్ టార్చర్...

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజా లో ఆయనని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది....

ఇన్ సైడ్ స్టోరీ: చిరంజీవిని వివాదాల్లోకి లాగితే ఏమొస్తుంది.?

ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పద్మ భూషణుడు చిరంజీవి.. ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి.! కొణిదెల శివ శంకర వరప్రసాద్ అసలు పేరు.! వెండితెరపై చిరంజీవిలా నాలుగు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన.! సక్సెస్,...

ఎక్కువ చదివినవి

RC 16.. పవర్ క్రికెట్..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన అంటూ తొలి ప్రాజెక్ట్ తోనే తన సత్తా చాటిన బుచ్చి బాబు రెండో...

జగన్ రాజకీయ పతనమే.. షర్మిల పంతమా!?

చెల్లెలు కట్టుకున్న చీర రంగు మీద కూడా నీఛాతి నీచమైన కామెంట్లు చేసే అన్నయ్య ఎవరైనా, ఎక్కడైనా వుంటారా.? ఎందుకు వుండరు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో వున్నారు కదా.! రాజకీయాల్లో విమర్శలు...

ఆంధ్ర ప్రదేశ్‌లో వుండటానికి వైఎస్ జగన్ ఎందుకు భయపడుతున్నారు.?

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఇటీవల లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరులో దిగిన జగన్, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్...

రక్త దాతలకు మెగాస్టార్ సత్కారం..!

తాను సంకల్పించిన ఒక కార్యక్రమాన్ని అభిమానులు సంకల్ప బలం తోడై ఇన్నేళ్లుగా ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేస్తున్న...

ఇన్ సైడ్ స్టోరీ: చిరంజీవిని వివాదాల్లోకి లాగితే ఏమొస్తుంది.?

ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పద్మ భూషణుడు చిరంజీవి.. ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి.! కొణిదెల శివ శంకర వరప్రసాద్ అసలు పేరు.! వెండితెరపై చిరంజీవిలా నాలుగు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన.! సక్సెస్,...