లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు హీరో రామ్. రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్టు. అప్పటి వరకు స్టైలిష్ గా కనిపించిన రామ్ లో ఎంత ఊర మాస్ ఉందన్నది ఇస్మార్ట్ శంకర్ తో తెలిసిపోయింది. పక్కా హైదరాబాదీ ఊరమాస్ పోరగాడిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన రామ్ నెక్స్ట్ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు.
పక్క మాస్ సినిమాతోనే తనకు హిట్ వస్తుందన్న ఆలోచనలో ఉన్నాడట రామ్. ఈ నేపథ్యంలో తాజాగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసాడు. అయితే కిషోర్ చెప్పిన కథ నచ్చిందట .. కానీ అందులో మాస్ అంశాలు లేకపోవడంతో కథలో మాస్ అంశాలు పెట్టమని చెప్పాడట. సదరు దర్శకుడు మాస్ విషయంలో కాస్త వీక్. ఎందుకంటే అయన ఇదివరకు చేసిన సినిమాలన్నీ క్లాస్ లుక్ లో ఉంటాయి .. అందుకే మాస్ అంశాలు సరిగ్గా జోడించలేదని, దాంతో రామ్ ఈ సినిమాను పక్కన పెట్టాడని అంటున్నారు.
సో నెక్స్ట్ సినిమా విషయంలో రామ్ మరో మాస్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి రామ్ ఆలోచనలకూ అనుగుణంగా ఏ దర్శకుడు మాస్ కథతో వస్తాడో చూడాలి.
