అటు ‘సున్నితమైన ప్రాంతం’ భైంసాలో బీజేపీ బహిరంగ సభ.! ఇటు హైద్రాబాద్‌లో వైఎస్ షర్మిల హైడ్రామా.! ఇంకోపక్క, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని తెలంగాణకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం.! ఈ మూడు అంశాల్నీ ఒకదానితో ఒకటి జత చేసి చూస్తూ, ఎక్కడో ఏదో తేడా కొడుతోందన్న సందేశం చాలామందికి కలుగుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం దాదాపు ఖాయమని ఇప్పటికే ప్రచారం జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా అదే. ఈ విషయమై వైఎస్ కుటుంబం ఒకింత డిఫెన్స్‌లో పడుతుందనీ, అందునా వైసీపీకి ఇది పెద్ద యెదురు దెబ్బ అనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాను ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రం నుంచి తన బాబాయ్ హత్యకేసుని పొరుగు రాష్ట్రానికి న్యాయస్థానం బదిలీ చేస్తే, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అవమానమే కదా.? ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే కాదు, పలువురు రాజకీయ పరిశీలకులూ కుండబద్దలుగొట్టేశారు.
ఇక, భైంసా వ్యవహారానికి వస్తే, అక్కడికి బీజేపీ వెళ్ళకుండా తెలంగాణలోని అధికార పార్టీ నానా తంటాలూ పడింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ, అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందన్న విమర్శలున్నాయి. కానీ, కోర్టు అనుమతితో భైంసాలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. తెలంగాణ రాష్ట్ర సమితికి కోలుకోలేని దెబ్బ.
మీడియాలో అటు వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం హైలైట్ కాకుండా.. ఇటు బీజేపీ భైంసా సభ గురించిన చర్చ జరగకుండా.. వైఎస్ షర్మిలతో ధర్నా డ్రామాకి జగన్, కేసీయార్ కలిసి తెరలేపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘జగన్ కోసం షర్మిల.. షర్మిల కోసం జగన్.. ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా వుంటారు..’ అని వైఎస్ విజయమ్మ చెప్పిన మాటల్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
Hey there, I think your website might be having browser compatibility issues. When I look at your blog in Chrome, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, very good blog!