సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా.. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేవు. చైతూతో విడిపోయి దాదాపు నాలుగేండ్లు అవుతోంది. ఇన్ని రోజులు ఆమె ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు మయోసైటిస్ కోసం ట్రీట్ మెంట్ కూడా తీసుకుంది. ఒక రకంగా ఆ వ్యాధి వల్ల ఆమె చాలా సమస్యలు ఎదుర్కుంటుంది. తన కెరీర్ ను కూడా పర్ ఫెక్ట్ గా ముందుకు తీసుకెళ్లలేకపోతోంది. అయితే ఇటు నాగచైతన్య మాత్రం తాను ప్రేమించిన శోభితతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక సిటాడెల్ ప్రమోషన్స్ లో తాజాగా సమంత మాట్లాడుతూ.. తనకు తల్లి కావాలని ఉందంటూ తెలిపింది. తాను అమ్మగా ఉండేందుకు ఇష్టపడుతాను అంటూ చెప్పింది. తాను అమ్మ కావడానికి ఆలస్యం అయిందని తాను అనుకోవట్లేదని తెలిపింది. ఈ లెక్కన తాను త్వరలోనే అమ్మ అవుతాను అన్నట్టు సమంత హింట్ ఇస్తోంది. అంటే ఆమె ఉద్దేశంలో రెండో పెళ్లి చేసుకోబోతుందన్నమాట. ఆమె కావాలనే ఇన్ని రోజులు ఆగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే చైతూ కంటే తాను ముందు చేసుకుంటే.. వచ్చే విమర్శలు, ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు.
వేరే వాడి కోసం చైతూను వదిలేసింది అంటూ దుమ్మెత్తిపోస్తారు. చైతూను మోసం చేసింది అంటారు. అప్పట్లో విడాకుల సమయంలో చైతూ కంటే సమంతనే ఎక్కువగా విమర్శించారు. అందుకే చైతూ పెళ్లి చేసుకునే దాకా తాను చేసుకోవద్దని ఆమె డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ముందు చైతూ చేసుకుంటే అతన్ని విమర్శిస్తారు. మొన్న ఎంగేజ్ మెంట్ చూశాక.. చాలా మంది సమంతను సపోర్టు చేస్తూ చైతూను విమర్శించారు. ఈ లెక్కన ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకుంటే ఆమెను సపోర్టు చేస్తారే తప్ప విమర్శించరన్న మాట. మరి సమంత ఎప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుందో.. ఎవరిని చేసుకుంటుందో చూడాలి.