రాజ్యసభ సభ్యుడు వైసీపీ నేత, విజయసాయి రెడ్డి ట్వీట్లేస్తే జనం పట్టించుకుంటారా.? ఛత్.. వైసీపీ శ్రేణులే ఆ ట్వీట్లని పట్టించుకోవ్.! పెయిడ్ వైసీపీ కూలీలు కూడా పట్టించుకోని విజయసాయి రెడ్డి ట్వీట్లను, ఈనాడు గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు ‘దివంగత’ రామోజీరావు పట్టించుకుంటారా.? ఛాన్సే లేదు.!
సరే, ఇక్కడ రామోజీరావుకి సర్టిఫికెట్ ఇవ్వడంలేదుగానీ, విజయసాయి రెడ్డి తాను ట్వీట్లతో రామోజీరావుని వేధించానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా మారింది. కొన్నాళ్ళపాటు రామోజీరావు మీద ట్విట్టర్ వేదికగా విజయ సాయి రెడ్డి సెటైర్లు వేస్తూ వచ్చారు.
ముందే చెప్పుకున్నట్లు, ఆ ట్వీట్లను వైసీపీ శ్రేణులే పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే, వైసీపీ అను‘కుల’ మీడియా కొంత అతి చేసింది. అదీ, కొన్నాళ్ళపాటే. తన ట్వీట్లకు పెద్దగా రీచ్ రాకపోవడంతో, రామోజీపై ట్వీట్ల యుద్ధాన్ని విజయ సాయి రెడ్డి స్వయంగా ఆపేసుకున్నారు.
అంటే, కొండని చూసి కుక్క మొరిగితే.. కొండకు చేటా.. అన్నట్లు.. అని భావించాలేమో ఇక్కడ.! అలాగని, టీడీపీ శ్రేణులు విజయ సాయి రెడ్డి మీద గుస్సా అవుతున్నాయి. అంతేనా, ‘అదిగో, విజయ సాయి రెడ్డి వేధింపుల వల్లే రామోజీరావు మనోవేదనకు గురై చనిపోయారు..’ అంటూ ఇంకొన్ని ట్వీట్లు సోషల్ మీడియా వేదికగా దర్శనమిస్తున్నాయ్. ఇది ఇంకా పెద్ద కామెడీ.
రామోజీ రావుకి వయసు అయిపోయింది, ఆయన కొన్నాళ్ళ క్రితమే తుది శ్వాస విడిచారు. పైగా, ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వున్నాయనుకోండి.. అది వేరే సంగతి.! వ్యవస్థల్ని తన కనుసన్నల్లో నడపగలననుకునే స్థాయికి రామోజీ, తన గురించి తాను ఎక్కువ ఊహించినా, సీఐడీ విచారణని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది మార్గదర్శి కేసులో.