కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,672FansLike
57,764FollowersFollow

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు ‘పెద్ది’పై పాజిటివ్‌గా మాట్లాడటం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకోవడం విశేషంగా మారింది.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్‌కు వచ్చిన ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా.. వాటి ప్రభావం ఆయన స్టార్‌డమ్‌పై పెద్దగా పడలేదనే అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. అందుకు ప్రధాన కారణంగా ‘పెద్ది’ చుట్టూ ఏర్పడిన బజ్‌ను సినీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ భారీ హైప్‌కు బుచ్చిబాబు కథనం, మేకింగ్ స్టైల్ ఒక కారణమైతే.. రామ్ చరణ్ చేసిన మేకోవర్, ఫిట్‌నెస్, పాత్ర కోసం తీసుకున్న ట్రాన్స్‌ఫర్మేషన్ మరో ప్రధాన ఆకర్షణగా మారాయి. అంతేకాదు, ఎమోషనల్ పాత్రల్లో రామ్ చరణ్ నటనపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతోంది.

సోషల్ మీడియాలో రామ్ చరణ్‌ను ట్రోల్ చేసే ఇతర హీరోల అభిమానులు కూడా ఈసారి ‘పెద్ది’ విషయంలో పెద్దగా నెగిటివ్ ప్రచారం చేయకపోవడం గమనార్హం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సాధారణ ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఒక ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడినట్లు కనిపిస్తోంది.

ఇటీవల టాలీవుడ్‌లో కొనసాగుతున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యల మధ్య కూడా అందరూ ముక్త కంఠంతో  ‘పెద్ది’ సినిమాకు ఎలాంటి ఆటంకాలు రావద్దని ఇండస్ట్రీ వర్గాలు కోరుకోవడం విశేషం. తెలుగు సినీ పరిశ్రమ మళ్లీ బలపడాలంటే పెద్ద సినిమాలు విజయవంతం కావాల్సిన అవసరం ఉందనే భావనతో చాలామంది ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘పెద్ది’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. కుదేలైన సినీ పరిశ్రమకు మళ్లీ ఊపిరి పోసే పెద్ద ఆశగా మారిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక కావాల్సిందల్లా పెద్ది ఎంత బిజినెస్ చేస్తుంది అనే లెక్కలే.

సినిమా

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో...

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

రాజకీయం

అమరవీరులకు పవన్ కళ్యాణ్ నివాళి.. నేషనల్ వార్ మెమోరియల్‌లో భావోద్వేగ క్షణాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. భారత సైనికుల ధైర్యం,...

ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం.. అయిదు కీలక తీర్మానాలకు ఆమోదం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశంలో ఐదు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది....

తప్పుడు ప్రచారమా?.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. డీఎస్సీ నియామకాల్లో కుల ప్రాధాన్యతకు సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన...

దేశ సమగ్రతే జనసేన లక్ష్యం.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ

ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన ‘సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం’ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి...

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

ఎక్కువ చదివినవి

అడవిలో మాయం.. ఆచూకీ కోసం ఆరాటం.. ఆరురోజులైనా జాను జాడ లేదు

కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో నివసిస్తున్న జ్ఞానేశ్వరి (జాను)...

Chiranjeevi-Suhasini: మణిరత్నం సినిమాలో ఆ సన్నివేశానికి చిరంజీవే స్ఫూర్తి: సుహాసిని

Chiranjeevi-Suhasini: తెలుగులో అత్యధిక సినిమాల శతదినోత్సవాలు జరిపిన హీరోగా మెగాస్టార్ చిరంజీవిదే రికార్డు. విజేత మొదలు ఎన్నో సినిమాలకు ఆయన అనేక పట్టణాలు, నగరాల్లో తన సక్సెస్ సినిమాలకు శతదినోత్సవాలు జరిపారు. గ్యాంగ్...

ఏపీ గ్రామాలకు భారీ వరం.. రూ.16,627 కోట్ల గ్రాంట్ మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి మొత్తం రూ.16,627 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. ఈ నిధులు 2026-27 ఆర్థిక...

పెద్ది బ్లాక్‌బస్టర్ తర్వాత జాన్వీ కపూర్‌కు రూ.8 కోట్ల పారితోషికం!

పెద్ది చిత్రానికి హీరోయిన్ జాన్వీ కపూర్‌కు తొలుత రూ.6 కోట్ల పారితోషికం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే సినిమా విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఆమెకు తుది సెటిల్‌మెంట్‌గా రూ.8 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది....

మాట నిలబెట్టుకున్న లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

రాజకీయ హింసకు గురైన కుటుంబాలకు అండగా నిలిచే నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లో నిలిచింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గతంలో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బీసీ...