Switch to English

పంగనామాల ప్రకాష్ రాజ్.. అమ్ముడుపోయాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

సినీ నటుడు ప్రకాష్ రాజ్, గత కొద్ది రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని టార్గెట్‌గా చేసుకుని, సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, వీడియోలతో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డూ నాణ్యతపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం చూశాం.

అయితే, పవన్ కళ్యాణ్ అలా సనాతన ధర్మం గురించి మాట్లాడటాన్ని, నాస్తికుడైన ప్రకాష్ రాజ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. సినీ రంగంలో పవన్ కళ్యాణ్ అంటే గౌరవం.. అని పలు సందర్భాల్లో చాటుకున్న ప్రకాష్ రాజ్, ఇప్పుడేమో ఇలా పవన్ కళ్యాణ్‌ని రాజకీయ శతృవుగా ఫిక్సయిపోయినట్టున్నాడు.

తాజా ట్వీట్‌లో ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking’ అంటూ పేర్కొన్నాడు ప్రకాష్ రాజ్.

ఇందులో, ‘పంగనామాలు’ అన్నమాట, ప్రకాష్ రాజ్‌కే సరిగ్గా సూటవుతుంది. మెగా కాంపౌండ్ నుంచి చాలా సాయాలు పొందిన ప్రకాష్ రాజ్ (సినిమా పరిశ్రమ పరంగా) ఇప్పుడేమో, ఇలా పవన్ కళ్యాణ్‌కి పంగనామాలు పెడుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

మరోపక్క, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త భక్తుడిగా మారిపోయిన ప్రకాష్ రాజ్, ట్విట్టర్ వేదికగా ఆడుతున్న డ్రామాలు అందరికీ స్పష్టంగానే అర్థమవుతున్నాయి. వైసీపీకి చెందిన చిన్నా చితకా హ్యాండిల్స్‌ని సైతం ప్రకాష్ రాజ్ ఫాలో అవడం మొదలు పెట్టాడు.

చూస్తోంటే, ప్రకాష్ రాజ్ వైసీపీలో చేరిపోయాడా.? వైఎస్ జగన్‌కి భక్తుడిగా మారిపోయాడా.? అన్న అనుమానం కలగడం మామూలే. అదే సమయంలో, వైసీపీ విసిరే పేటీఎం బిచ్చానికి తలొగ్గి, ఏకంగా ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌నే అమ్మేసుకున్నాడా.? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయ్.

ఏదిఏమైనా, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. అన్నట్లుంది ప్రకాష్ రాజ్, కొత్త ట్వీట్ల వ్యవహారం.

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

“మారిపోతా సార్”… కస్టడీలో ఐబొమ్మ రవి ప్రాధేయన

ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆన్‌లైన్ పైరసీ నెట్‌వర్క్‌ను సంవత్సరాల పాటు నడిపిన రవి ఇప్పుడు విచారణలో పోలీసుల ముందు మనసు విప్పినట్లు తెలుస్తోంది. ఆరేళ్ల పాటు ఎవరూ తనను...

సమంత సామ్రాజ్యం రూ. 200 కోట్లు దాటింది! భర్త రాజ్ కన్నా ఎక్కువే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి హైలైట్ అవుతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలం సింగిల్‌గా ఉన్న సమంత ఇప్పుడు దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూరులో పెళ్లి చేసుకుని...

నెల్లూరు లేడీ డాన్ కామాక్షి అరెస్ట్… నగరాన్ని కుదిపేసిన కేసులో సెన్సేషన్

నెల్లూరు నగరాన్ని కుదిపేసిన సీపీఐ కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా పేరొచ్చిన లేడీ డాన్ కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోడిగానితోటలోని ఆమె నివాసంపై పోలీసులు భారీగా దాడులు నిర్వహించి, ఇంట్లో...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం: కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి అలర్ట్ మోగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 36 ఏళ్ల మహిళ స్క్రబ్ టైఫస్ కారణంగా మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది....