తెలంగాణ మంత్రి కొండా సురేఖ, సినీ నటి సమంతకి బేషరతు క్షమాపణలు చెప్పారు. ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పడమే కాకుండా, మీడియా ముందుకొచ్చి కూడా సమంతకి క్షమాపణలు చెప్పారు కొండా సురేఖ. తప్పు తెలుసుకున్నందుకు కొండా సురేఖని అభినందించాలా.? వయసొచ్చినా బుద్ధి లేనందుకు తప్పు పట్టాలా.?
ఇంతకీ, కొండా సురేఖ క్షమాపణను సమంత ‘యాక్సెప్ట్’ చేస్తుందా.? లేదా.? అన్న చర్చ అంతటా జరుగుతోంది. నిజానికి, ఈ వ్యవహారంలో, అటు నాగార్జున ఇటు కేటీయార్ కూడా తీవ్రాతి తీవ్రంగా అవమానపడాల్సి వచ్చింది. వీరిద్దరికీ పరువు నష్టం కలిగించేలా కొండా సురేఖ వ్యాఖ్యలున్నాయి. సమంత సంగతి సరే సరి.
ఇప్పటికే, లీగల్ నోటీసులు కొండా సురేఖకి పంపించారు తెలంగాణ మాజీ మంత్రి కేటీయార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా వున్న కేటీయార్, ప్రస్తుతం అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తనకు సమంతతో లింకులు పెడుతూ కొండా సురేక చేసిన వ్యాఖ్యల్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు కేటీయార్.
లీగల్ నోటీసులంటే ఆషామాషీగా కాదు, కొండా సురేఖని ఈ కేసులో అరెస్టు చేయించి, జైల్లో పెట్టించే దిశగా.. వ్యూహ రచే చేస్తున్నారట కేటీయార్. అన్నట్టు, ఈ కేసులోకి రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, ఆమె కూడా లీగల్ యాక్షన్‌కి రెడీ అవుతోందిట.
అక్కినేని నాగార్జున ఇప్పటికే తన లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనీ, ఈ విషయాన్ని అస్సలు వదిలిపెట్టకూడదని నాగార్జున సతీమణి అమల అనుకుంటున్నారనీ, అఖిల్ అలాగే నాగచైతన్య కూడా, ఈ విషయంలో పట్టుదలగా వున్నారని సమాచారం.
సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు ‘క్షమాపణ’తో సద్దుమణగడం చూస్తున్నాం. కానీ, క్షమాపణతో సద్దుమణిగే వ్యవహారంలా కనిపించడంలేదిది. అందుకే, కొండా సురేఖ.. ఉన్నత స్థాయిలో లాబీయింగ్ షురూ చేశారట. మరి, అది ఫలిస్తుందా.? వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం. కొండా సురేఖ క్షమాపణ చెప్తే సరిపోదు, పదవులకు రాజీనామా చేయాల్సి వుంటుంది.