రఘురామకి ఫ్రాక్చర్.! థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే, ఎముకలే వుండకూడదు కదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు.. ప్రస్తుతం అత్యంత గౌరవ ప్రదమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆయన. ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసన సభ్యులు, మండలి సభ్యుల ఆట విడుపు నిమిత్తం ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో ప్రజా ప్రతినిథులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆట అన్నాక అపశృతులు మామూలే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, క్రికెట్ ఆడుతూ పరుగు తీసే క్రమంలో కింద పడిపోయారు.

కింద పడ్డ రఘురామకృష్ణ రాజుకి గాయాలయ్యాయి. ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, ఫ్రాక్చర్స్ అయినట్లు వైద్యులు గుర్తించారు, శస్త్ర చికిత్స కూడా చేశారు. ఫ్రాక్చర్‌కి సంబంధించిన ఎక్స్‌రే వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, గతంలో వైసీపీ ఎంపీగా వున్న సమయంలో రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగింది. తనను దారుణంగా కొట్టారంటూ రఘురామ స్వయంగా ఆరోపించారు, ఈ మేరకు కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో పలు అరెస్టులు కూడా జరిగాయి.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు రఘురామకి ఫ్రాక్చర్ అవడానికి సంబంధించి. ఒకవేళ రఘురామ ఆరోపిస్తున్నట్లుగా కస్టోడియల్ టార్చర్ జరిగి వుంటే, ఆయనకున్న బోన్ డెన్సిటీకి, ఎప్పుడో అవి నుజ్జునుజ్జు అయిపోయి వుండాలని వ్యాఖ్యానించారు.

ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి.? అన్న చర్చ అంతటా జరుగుతోంది. ఎంత ద్వేషంతో ఆ ఐపీఎస్ అధికారి రగిలిపోతున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసే క్రమంలో, చట్టానికి దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారన్నది నిర్వివాదాంశం.

బోన్ డెన్సిటీ అంశాన్ని ప్రస్తావిస్తూ, పరోక్షంగా పోలీసు వ్యవస్థపైనే ప్రజల్లో ఏహ్యభావం కలిగేలా సదరు ఐపీఎస్ అదికారి వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అన్నట్లు రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఓ పోలీస్ అధికారి, వైసీపీ అధికారం కోల్పోగానే బీహార్‌కి వెళ్ళిపోవడం, అక్కడ ఆయన్ని ఏపీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేస్తే, బీహార్ ప్రభుత్వం ఆయనకి రక్షణ కల్పించడం తెలిసిన విషయాలే.

సినిమా

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

సురేఖ కొణిదెల స్విచ్ ఆన్‌తో ‘కనక దుర్గ’ ప్రారంభం

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘కనక దుర్గ’ శనివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తమిళ సినీ రంగంలో కంటెంట్ ఆధారిత చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్,...

పెళ్లి బ్రేక్ తర్వాత నార్నే నితిన్ కొత్త సినిమా ఫిక్స్

పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న నార్నే నితిన్ ఇప్పుడు మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన...

చరణ్ విషయంలో తారక్ సైలెన్స్ ఎందుకు?

ఒకప్పుడు “రామ్ చరణ్ బర్త్‌డే అంటే రాత్రి 12 గంటలకు వాళ్ల ఇంట్లో ఉంటా… తప్పకుండా విష్ చేస్తా” అని చెప్పిన తారక్ మాటలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి....

మూడు రోజుల వర్ష హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాలకు పిడుగు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నేడు, రేపు మరియు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో...

“‘రియాలిటీ’తో రాబోతున్న కిరణ్ అబ్బవరం… కొత్త కాన్సెప్ట్ సిగ్నల్?”

యువ హీరో కిరణ్ అబ్బవరం తన తదుపరి ప్రాజెక్ట్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలిసింది. టైటిల్ వినగానే సినిమా కథపై...