ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొచ్చింది.
పైగా, తమ పార్టీ అధినేత తండ్రి విగ్రహాలను జాగ్రత్తగా చూసుకున్న వైసీపీ, గ్రామస్తుల ఇళ్ళ కూల్చివేత విషయంలో మాత్రం వెకిలి వ్యాఖ్యలు చేసింది. గతంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కోసం ఇప్పటం గ్రామ ప్రజలు తమ భూముల్ని ఇచ్చారు. ఆ గ్రామ అభివృద్ధి కోసం జనసేన అధినేత 50 లక్షల రూపాయల సాయం అందించారు.
‘మీకు మా భూముల్ని ఇవ్వడం వల్లనే మా మీద కక్ష కట్టారు..’ అని గ్రామస్తులు వాపోవడంతోనే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఇప్పటం వెళ్ళి, బాధితుల్ని ఓదార్చారు, వారికి అండగా నిలబడతామని చెప్పారు. న్యాయస్థానం కూడా కూల్చివేతలపై స్టే విధించింది.
అయితే, ఇప్పటం గ్రామస్తులు వాస్తవాల్ని దాచిపెట్టి కోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం తన వాదనను వినిపించింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. ముందుగానే నోటీసులు ఇచ్చారన్న విషయాన్ని సదరు గ్రామస్తులూ (పిటిషన్ దారులు) ఒప్పుకోవడంతో, విషయం కొత్త మలుపు తిరిగింది. పిటిషనర్లకు న్యాయస్థానం జరీమానా విధించింది.
న్యాయస్థానమే తొలుత పిటిషనర్ల వాదనలో నిజముందని భావించి స్టే ఇచ్చినప్పుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారి మాటలు నమ్మి, వారికి భరోసా ఇవ్వడంలో వింతేముంది.? ఇక్కడేదో పవన్ కళ్యాణ్‌కి ఎదురు దెబ్బ తగిలిందనడం ఎంతవరకు సబబు.?
ఫాఫం బులుగు మీడియాకి పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే తప్ప పూట గడవదు. ఒక్క కేసులో గ్రామస్తులకు లక్ష జరీమానా పడినందుకు బులుగు మీడియా, బులుగు పార్టీ పండగ చేసుకుంటున్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది.? జరీమానాలు విధించింది.?