Switch to English

ఇంటర్వ్యూ: ఇష్టం లేదు, కానీ మార్కెట్ దృష్ట్యా విష్ణుతో ఆ ప్లాప్ సినిమా చేశా – జి. నాగేశ్వరరెడ్డి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

‘సీమశాస్త్రి’, ‘సీమ టపాకాయ్’, ‘దేనికైనా రెడీ’, ‘కరెంట్ తీగ’, ‘ఈడో రకం ఆడో రకం’ చిత్రాలతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి. ఈమధ్య ఆయన తీసిన సినిమాలు సరిగా ఆడలేదు. అలాగని ఆయన ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ‘తెనాలి రామకృష్ణ బిఏబీఎల్’ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచారు. ఈ సినిమా గురించి జి. నాగేశ్వరరెడ్డితో ఇంటర్వ్యూ…

వికటకవి తెనాలి రామకృష్ణకు, మీ రామకృష్ణకు పోలికలు ఉన్నాయా?

వికటకవిలో చమత్కారం, హాస్యం మా రామకృష్ణలోనూ ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల దగ్గర తెనాలి రామకృష్ణ ఎంత నవ్వించారో, శ్రీకృష్ణదేవరాయలు ఒక సమస్యలో ఉన్నప్పుడు అంతే సీరియస్ గా వ్యవహరించారు. రాజును కాపాడారు. మా రామకృష్ణ కూడా నవ్విస్తాడు. సెకండాఫ్ వచ్చేసరికి ఓ సమస్య విషయంలో అంతే సీరియస్ గా ఫైట్ చేస్తాడు.

అసలు, హీరో క్యారెక్టర్ ఏంటి?

సివిల్ కోర్టులో లాయర్. కాంప్రమైజ్ అయితే కోర్టుల వరకు వెళ్లవలసిన అవసరం లేదనేది అతడి అభిమతం. భాస్కరభట్లగారు రాసిన టైటిల్ సాంగులో, ఆయన అదే చెప్పారు. ఎటువంటి కేసులోనైనా కాంప్రమైజ్ చేయాలని చూసే తెనాలి రామకృష్ణ, ఓ కేసులో మాత్రం అసలు కాంప్రమైజ్ కాకూడదని బలంగా నిలబడతాడు. అదేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

హన్సిక కూడా లాయర్ గా నటించినట్టున్నారు?

హన్సిక సరదా లాయర్. ఒక్క కేసు కూడా వాదించదు. కానీ, తానొక మహామేధావి అనుకునే ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేసింది. తనకు కేసు వస్తే అసలు ఓడిపోనని ఫీలింగ్. ప్రేక్షకులను హన్సిక నవ్విస్తారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ ఏంటి?

ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. ఆమె ఫెంటాస్టిక్ పెరఫార్మెర్. ముందు ఆ క్యారెక్టర్ కు ఆమెను తీసుకోవాలని అనుకున్నప్పుడు ‘మంచి ఆర్టిస్ట్ ను తీసుకొచ్చి వేస్ట్ చేశారు’ అంటారేమో అని ఆలోచించా. చివరకు, క్యారెక్టర్ చేసినందుకు ఆమె హ్యాపీగా ఫీలయ్యారు.

సినిమాలో సందేశాలు ఏమైనా ఇచ్చారా?

సందేశం కంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎక్కువ నవ్విస్తుంది. ప్రజలు అందరూ పని ఒత్తిడిలో పడి నవ్వడం మర్చిపోతున్నారు. ఒకప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి కూర్చున్నప్పుడు సరదాగా నవ్వుకునేవాళ్ళం. వర్క్ టెన్షన్స్, ప్రెజర్స్ లో పడి నవ్వట్లేదు. నాకు కొన్నిసార్లు టెన్షన్స్ ఉంటాయి. చివరకు, లాఫింగ్ క్లబ్స్ పెట్టుకుని అక్కడికి వెళ్లి నవ్వుతున్నాం. సినిమాకు ప్రేక్షకులను నవ్వించే శక్తి ఉంది. ఈ సినిమా అందరిని బాగా నవ్విస్తుంది.

సినిమాను తమిళంలో విడుదల చేస్తున్నారా?

సినిమా హిట్టయ్యితే రీమేక్ చేస్తాం. ప్లాప్ అయ్యితే డబ్బింగ్ చేస్తాం. సినిమాను తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉంది.

నవ్వించాలని మీరు చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సరిగా ఆడలేదు. డిజప్పాయింట్ అయ్యారా?

అవును. మనం చేసిన సినిమా సరిగా ఆడకపోతే డిజప్పాయింట్ అవుతాం. అయితే ముందు ఆ కథను చెయ్యడం నాకు ఇష్టం లేదు. కొన్ని మార్కెటింగ్ పరిస్థితుల వల్ల చెయ్యవలసి వచ్చింది. ప్రతిసారి బ్రాహ్మిణ్స్, వాళ్లపై జోకులు వెయ్యడం కరెక్ట్ కాదని అనిపించింది. కానీ, చెయ్యవలసి వచ్చింది. ఆ సినిమా నాకు, మంచు విష్ణుకు, నిర్మాతకు లాస్ మిగిల్చింది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?

ఈ సినిమా విడుదల తర్వాత చెప్తా.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....