Switch to English

ఇంటర్వ్యూ: రామ్‌చరణ్ వంటి స్టార్ చేశాడు కాబట్టి ‘రంగస్థలం’ పిచ్చ పిచ్చగా ఆడింది – శ్రీవిష్ణు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

హీరోగా నలుగురు నడిచే దారిలో శ్రీ విష్ణు నడవడం లేదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ హిట్ తర్వాత కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో క్యారెక్టర్ చేశాడు. హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. ‘మెంటల్ మదిలో’ ‘నీదీ నాదీ ఒకే కథ’ ‘బ్రోచేవారెవరురా’ హిట్స్ తర్వాత సోలో హీరోగా శ్రీవిష్ణు యాక్ట్ చేసిన సినిమా ‘తిప్పరా మీసం’. ఫ్రైడే రిలీజ్. మరికొన్ని గంటల్లో సినిమాను థియేటర్లలో చూడొచ్చు. ఈ సందర్భంగా శ్రీవిష్ణుతో ఇంటర్వ్యూ

‘తిప్పరా మీసం’ అని మాస్ టైటిల్ పెట్టారు. మదర్ సెంటిమెంట్ అన్నారు. సినిమాలో పాయింట్ ఏంటి?

సినిమా పాయింట్ ఏంటంటే…. హీరో మదర్ మంచి ఆవిడ. విలన్ మదర్ కూడా మంచి ఆవిడ ఉంటారు కదా. ఏ మదర్ అయినా కొడుకు ఎంత వెధవ అయినా ఒకేలా ప్రేమ చూపిస్తారు. అలా, మేం హీరో కథ కాకుండా ఒక నెగిటివ్ క్యారెక్టర్ కథ తీసుకుని సినిమా చేశాం. ఏదో ఒక మూమెంట్ లో మనం దేనికి లొంగినా, లొంకగపోయినా అమ్మ ప్రేమకు లొంగాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఫీలవ్వాలి. సందర్భాన్ని బట్టి అమ్మ ప్రేమను అర్థం చేసుకునే ఒక నెగిటివ్ క్యారెక్టర్ కథ ఈ సినిమా. మదర్ క్యారెక్టర్ రోహిణిగారు చేశారు. ఎక్సట్రాడినరీగా చేశారు.

సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి?

నైట్ క్లబ్ లో పని చేసే డీజే. వాడికి నచ్చిన స్టయిల్ లో ఉంటాడు. అందరూ చేసేవి చేయదు. డెడ్ ఎగైనెస్ట్ ఉంటాడు. అందుకని, గడ్డం లుక్ ట్రై చేశా. నైట్ డీజే క్లబ్ లో పని చేసి వచ్చాక, తిని తాగి పడుకుంటాడు. వేరే పని ఏదీ చేయండి. ఈ క్యారెక్టర్ కోసం 8 కేజీలు బరువు పెరిగా. మాస్ అప్పీల్, కేర్ లెస్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్. వీడికి తగిలేవి అన్నీ నైట్ తగులుతాయి. మ్యాగ్జిమమ్ సినిమా వచ్చి నైట్ లో ఉంటుంది.

‘బ్రోచేవారెవరురా’ కామెడీ ఎంటర్టైనర్ కనుక ఎక్కువమందికి చేరువైంది. ఇటువంటి క్యారెక్టర్ ఉన్న సినిమా అంత రేంజ్ కి వెళుతుందని అనుకుంటున్నారా?

ముందే బారియర్ పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు కామెడీ మాత్రమే ఎక్కువ మందికి చెరువు అవుతుందని అనుకుంటే ఇంక ఎవరు వేరే సినిమాలు చెయ్యక్కర్లేదు. ఓన్లీ కామెడీ మీద చేసుకోవచ్చు. కామెడీ ప్రేక్షకులకు చిన్న రిలీఫ్ ఇవ్వడంలో హెల్ప్ అవుతుంది. కామెడీతో పాటు కంటెంట్ ఉండాలి. కామెడీ ఎంత ఉన్నా, జోకులు వచ్చినప్పుడు ప్రేక్షకుడు నవ్వుకుంటాడు కానీ థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫీల్ తో రాడు. ఈరోజులు ఎంత కామెడీ ఉన్నా సినిమాలో ఏదో ఒక కొత్త విషయం లేకపోతే శాటిస్ఫాక్షన్ తో బయటకు రాడు. వాడు ఎంజాయ్ చేసింది పక్కవాడితో చెప్పడు. నిజంగా, కంటెంట్ ఉండి కామెడీ కుదిరిందంటే సినిమా బాగుందని నలుగురికి చెప్తాడు.

‘తిప్పరా మీసం’లో కామెడీ ఉంటుందా?

‘బ్రోచేవారెవరురా’లో క్యారెక్టర్ల వల్ల మీకు నవ్వు వచ్చింది. దీంట్లో కూడా అటువంటి క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. నేను చేసే కొన్ని వేషాలు నవ్విస్తాయి. క్రేజీ కామెడీ. ఒక పాయింట్ వచ్చాక నా క్యారెక్టర్ ని చూస్తే నవ్వు వస్తుంది. డైలాగ్ లేకపోయినా, నేను వేసే వేషాలు నవ్విస్తాయి.

ఒక్కో సినిమాకు మెట్టు ఎక్కుతున్నారు. ‘బ్రోచేవారెవరురా’తో ఎక్కువమందికి రీచ్ అయ్యారు. దాని కంటే బాగుండాలని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా!

డెఫినెట్ గా సినిమా బాగుండాలని చూస్తారు. నా సినిమాలు చూసే ఆడియన్స్ పెరుగుతారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. లక్కీగా నా నుండి ఆడియన్స్ డిఫరెంట్ సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నేను ఎలాగో డిఫరెంట్ చేస్తా. ఆడియన్స్ సినిమా చూసి హ్యాపీగా ఫీలవుతారు. ఇప్పుడు మనకు కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. కంటెంట్ తో పాటు ఈ సినిమాలో కమర్షియల్ వేల్యూ యాడ్ కావడం కొత్తగా ఉంటుంది. కొడితే ఎగిరిపోవడాలు, బ్లాస్ట్ లు టైప్ కమర్షియల్ కాదు. యాక్షన్ డ్రామా. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను బి, సి సెంటర్స్ కి తీసుకువెళ్ళాలని ఈ సినిమా చేశాం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, అవి ఈ సినిమాలో యాడ్ చేశాం.

గతంలో చేసిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను బి, సి సెంటర్స్ కి తీసుకువెళ్లలేకపోయామని ఫీలింగ్ ఉందా?

డెఫినెట్ గా ఉంది. బి, సి సెంటర్స్ కి వెళితే బెటర్ రెవిన్యూ సంపాదించవచ్చు. నా ఒక్కడి సినిమా అని అనడం లేదు. చాలా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎ సెంటర్స్ లో ఆడినంత బాగా, కింద సెంటర్స్ లో ఆడటం లేదు. అదెందుకు అంటే కొన్ని ఎలిమెంట్స్ కి వాళ్ళు అట్ట్రాక్ట్ అవుతారు. తెలుగులో డిఫరెంట్ సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను మెచ్చుకుంటున్నారు. ఇంకా మొత్తం మెచ్చుకోవడం లేదు. రెండు మూడు సంవత్సరాల్లో అందరూ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తారని నేను అనుకుంటున్నా. నిజంగా ‘రంగస్థలం’ కాన్సెప్ట్ ఫిలిమ్. పిచ్చి పిచ్చిగా ఆడింది. ఆడియన్స్ కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చూస్తున్నారు. కాకపోతే పెద్ద స్టార్స్ చేసినప్పుడు ఈజీగా అందరికీ తెలుస్తుంది. కొత్త వాళ్ళు, నాలాంటి వాళ్ళు చేస్తే బి, సి సెంటర్స్ కి తీసుకువెళ్లడం కష్టం అవుతుంది.

‘తిప్పరా మీసం’లో కంటెంట్, కమర్షియల్ వేల్యూస్ రెండు ఉన్నాయా?

అవును. ఈ డైరెక్టర్ ఎటువంటి ఓవర్ ఎలిమెంట్స్ లేకుండా రియలిస్టిక్ గా బాగా తీశాడు. నన్నే ఇలా చూపిస్తే పెద్ద హీరోను ఎలా చూపిస్తాడని అనుకుంటారు.

మీ నెక్స్ట్ ఫిలిమ్స్?

మూడు సినిమాలు అనౌన్స్ చేశా. ఏది ముందు సెట్స్ మీదకు వెళుతుందని వారంలో చెప్తా. నారా రోహిత్ తో ఒక హిస్టారికల్ ఫిలిమ్ చేయాలనుకుంటున్నాను. స్టోరీ రెడీ అవుతుంది. అది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...