ఏపీ ఇంటర్ బోర్డు సంచలన ప్రకటన చేసింది. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను రద్దు చేసింది. ఇక నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండవని.. కేవలం సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. స్టూడెంట్స్ మీద ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం ప్రటకన చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యలో సంస్కరణలు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా స్టూడెంట్లను తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు.
ఇందులో భాగంగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో కొన్ని మార్పులు చేస్తున్నామన్నారు. సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఈ సిలబస్‌పై దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. ఎన్ సీఈఆర్ టీ సిలబస్ వల్ల మాథ్స్, కెమిస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సిలబస్ తగ్గిస్తామని దానికి బదులు కొత్త సబ్జెక్టులను ఆడ్ చేస్తామన్నారు. ఇక నుంచి ఇంటర్ సబ్జెక్టులు మొత్తం తెలుగుతో పాటు ఇంగ్లిష్ లో కొనసాగుతాయన్నారు. ప్రతి సబ్జెక్టుకు 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయన్నారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని.. ఇక నుంచి విద్యార్థులకు సబ్జెక్టు పట్ల శ్రద్ద పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు అలాగే వారి స్కిల్స్ ను పెంచేలా సంస్కరణలు ఉంటాయని చెప్పారు.