Switch to English

బిగ్‌ బాస్ 6 సుదీప గురించి ఆసక్తికర విషయాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో రెండవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన సుదీప అలియాస్ పింకీ సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. చాలా సంవత్సరాల క్రితమే ఆమె వెండి తెరపై మెరిసిన ఒక బుల్లి స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాలో హీరోయిన్ చెల్లి గా పింకీ పాత్రలో సుదీప నటించి మెప్పించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అందరూ ఆమెను పింకీ అనే పేరుతోనే పిలుస్తున్నారంటే ఆ పాత్ర ఎంతగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

పెళ్లి చేసుకుని జీవితంలో ముందుకు సాగుతున్న సుదీప ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆడుతోంది. తనదైన శైలి ఆటతో సుదీప తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. బాగా అగ్రెసివ్ కాకుండా మరీ సైలెంట్ కాకుండా సుదీప ఒక మోస్తరు కంటెస్టెంట్ అన్నట్లుగా ముందుకు సాగుతోంది. అందరిని కలుపుకొని వెళ్తున్న ఆమె గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.. 1987వ సంవత్సరంలో సుదీప జన్మించింది. ఆమె కుటుంబ బ్యాక్ గ్రౌండ్ కారణంగా చిన్నప్పుడే క్లాసికల్ డాన్సర్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది.

తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులకు ప్రోత్సాహంతో క్లాసికల్ డాన్సర్ గా అనేక చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చిన ఘనత ఆమెకు దక్కింది. చిన్న వయసులోనే సుదీప సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 1994వ సంవత్సరంలో సుదీప సినిమాలో నటించింది. కొత్త బంగారం, ప్రతి ఘటన సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువ శాతం సీరియల్స్ కే సమయం కేటాయిస్తూ వచ్చింది. సినిమాల్లో చిన్నా చితక ఆఫర్లు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోకుండా కేవలం బుల్లి తెరపై ఆసక్తి చూపించింది.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించిన సుదీప పూర్తిగా హైదరాబాదులోనే సెటిల్ అయింది. హైదరాబాదులోనే ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ నివసిస్తుంది. 30 సినిమాల్లో నటించిన సుదీప ఎన్నో బుల్లి తెర కార్యక్రమాల్లో కనిపించింది. చాలా కార్యక్రమాల్లో తన యొక్క పూర్తి పేరును కూడా ఎప్పుడూ చెప్పకుండా పింకీ పేరుతోనే ఫేమస్ అయింది.

ఎప్పటికప్పుడు బుల్లి తెరపై మంచి పేరును దక్కించుకుంటూ నిలిచిన సుదీప ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో 21 మంది కంటెస్టెంట్స్ తో పోటీపడుతూ హౌస్ లో అడుగు పెట్టింది. ఆమె ఆట తీరు ముందు ముందు ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆమె బిగ్ బాస్ హౌస్ లో తన ఎమోషనల్ స్టోరీ చెప్పి అందరిని కంట తడి పెట్టించింది.

థైరాయిడ్ ఎక్కువ పర్సంటేజ్ ఉండడం వల్ల అబార్షన్ అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకొని అందరితో కన్నీళ్లు పెట్టించిన సుదీప ఆ బాధను దిగమింగుకుంటూ అందరితో సంతోషంగా ఉంటూ ఆటలాడుతుంది. ముందు ముందు కూడా ఆమె ఆట హ్యాపీగా సాగాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్‌ పింకీ అలియాస్ సుదీప.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....