Switch to English

బిగ్‌ బాస్ 6 చలాకీ చంటి గురించి ఆసక్తికర విషయాలు

91,318FansLike
57,013FollowersFollow

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 6 లో అయిదవ కంటెస్టెంట్‌ గా చలాకీ చంటి అడుగు పెట్టాడు. ఈయన గురించి బుల్లి తెర ప్రేక్షకులకు మాత్రమే కాకుండా వెండి తెర ప్రేక్షకులకు కూడా గత దశాబ్ద కాలంగా తెలుసు. సినిమాలు.. షో లతో చాలా పాపులారిటీని సొంతం చేసుకున్న చలాకీ చంటి బిగ్ బాస్ లో అడుగు పెట్టడం చాలా మందికి ఆశ్చర్యంను కలిగించింది. ఎందుకంటే చలాకీ చంటి ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ కామెడీ షో లో టీమ్‌ లీడర్ గా కొనసాగుతున్నాడు.

ఆయనకు మల్లెమాల వారు పలు సార్లు మంచి అవకాశాలు ఇచ్చారు. సొంతంగా నా షో నా ఇష్టం అనే షో ని కూడా చేసేందుకు అవకాశం ఇచ్చారు. జబర్దస్త్‌ నుండి ఎన్ని సార్లు బయటకు వెళ్లినా కూడా ఎవరికి దక్కని రీ ఎంట్రీ అవకాశం ఒకటి కాదు రెండు కాదు పలు సార్లు చలాకీ చంటికి జబర్దస్త్‌ లో దక్కింది. అది కేవలం చలాకీ చంటికే సాధ్యం అయ్యిందని ఇప్పటికి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు.

మల్లెమాల వారు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే టీమ్‌ లీడర్స్ లో చలాకీ చంటి ఒకరు అనడంలో సందేహం లేదు. అంతగా ప్రాముఖ్యత కలిగి.. అక్కడ అత్యంత సీనియార్టీ కలిగిన టీమ్‌ లీడర్ ల్లో ఒకడిగా ఉన్న చలాకీ చంటీ జబర్దస్త్‌ లో అడుగు పెట్టడం చాలా మందికి ఆశ్చర్యంను కలిగించింది. ఇంతకు చంటి ఎందుకు జబర్దస్త్‌ లో అడుగు పెట్టాల్సి వచ్చింది.. ఆయన బయోగ్రఫీ ఏంటీ అనేది మరింతగా తెలుసుకుందాం రండీ… చంటి 1986వ సంవత్సరం జూన్ 29వ తారీఖున హైదరాబాదులో జన్మించాడు, స్థానికంగానే ఆయన విద్యాభ్యాసం అంతా పూర్తి అయింది.

హైదరాబాదులోని మహా విద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో బీకాం డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితి కారణంగా ఒక టెలికాం సంస్థలో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేశాడు. మరో వైపు రేడియో మిర్చి లో ఆర్జే గా కూడా పేరు దక్కించుకున్నాడు. ఈయన అసలు పేరు వినయ్ మోహన్.. ఆర్ జె గా ఉన్న సమయంలో చంటి అనే పేరు మార్చుకున్నాడు. జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన తర్వాత చలాకి చంటి గా మారిపోయాడు.

మిమిక్రీపై పట్టు ఉండడంతో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకుల అభిమానం ను సొంతం చేసుకున్న చలాకి చంటి సినిమాల్లో కూడా రాణించాడు, భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో కీలక పాత్ర లో చలాకి చంటి నటించిన మెప్పించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించాడు. 2013 సంవత్సరంలో జబర్దస్త్ కార్యక్రమం ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన నా షో నా ఇష్టం తో ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యాడు.

బుల్లి తెర స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న చలాకీ చంటి కి కాస్త పొగరు ఎక్కువ, అవతలి వాళ్ళు మంచి చెప్తే వినేందుకు సిద్ధపడడు.. అవతలి వాళ్ళు సలహాలిస్తే అస్సలు పట్టించుకోడు, ఎవరినైనా కాస్త దురుసుగానే పలకరిస్తాడు.. చాలా త్వరగా కలిసిపోతాడు అనేది ఆయన గురించి ఉన్న అభిప్రాయం. తెలుగు సినిమా పరిశ్రమలో ఏకంగా 80 సినిమాల్లో నటించిన చలాకి చంటి జబర్దస్త్ కార్యక్రమంలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగాడు, ఇప్పుడు బిగ్బాస్ లో ఉన్నాడు.

మళ్ళీ జబర్దస్త్ లో కనిపించే అవకాశం లేనట్లే. బిగ్ బాస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న చలాకి చంటి ఎన్ని వారాలు కొనసాగుతాడో చూడాలి. టాప్ 5 వరకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని ఆయన అభిమానులు అభిప్రాయం చేస్తున్నారు. తన కామిడీ టైమింగ్ తో అందరితో కలిసి పోయే విధంగా చంటి వ్యవహరిస్తున్నాడు. అప్పుడప్పుడు తనదైన ఈగో ని చూపించేందుకు కూడా వెనకాడడం లేదు. కనుక చంటి ఎన్నాళ్ళు ఉండేది క్లారిటీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

ఎక్కువ చదివినవి

కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ‘అయ్యా.! యెస్.!’ అనాల్సిందేనా.?

కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలకు ‘యెస్’ అనేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందా.? సర్వోన్నత న్యాయస్థానం అబ్జర్వేషన్ ఇదే.! చిన్న విషయంగా దీన్ని చూడలేం. సర్వోన్నత న్యాయస్థానం ఎంతో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి. కేంద్ర...

ఆసుపత్రిలో బెడ్ పై ‘ప్రేమదేశం’ అబ్బాస్..! అభిమానుల ఆందోళన..

ప్రేమదేశం సినిమాతో దక్షిణ చలన చిత్రసీమలో పెను సంచలనం సృష్టించిన హీరో అబ్బాస్. హ్యాండ్సమ్ లుక్ తో అమ్మాయిలకు హార్ట్ త్రోబ్ అయితే.. తన హెయిర్ స్టైల్ తో అబ్బాయిలకు హాట్ ఫేవరేట్....

‘మల్లారెడ్డి కాలేజీల్లో కోట్ల రూపాయల నగదు స్వాధీనం’ ఐటీ అధికారుల వెల్లడి

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం...

వావ్: 400 కోట్ల క్లబ్ లో కాంతారా

కేవలం 16 కోట్లతో కన్నడలో రూపొందిన ఒక చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం నిజంగా అమోఘం. నిజానికి ఆ సినిమాలో ఎవరూ కర్ణాటక దాటితే బయట తెలీరు. అయినా కానీ కాంతారా అద్భుత...

శీతాకాలంలో “గుర్తుందా శీతాకాలం”

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు....