ఇప్పుడు ప్రపంచ మంతా ఇన్ స్టా రీల్స్ తోనే టైమ్ పాస్ చేస్తోంది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఏదో ఒక రీల్ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు. కొందరు టైమ్ వేస్ట్ కూడా చేసుకుంటున్నారు. ఇన్ స్టా మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా కూడా దానికి ఆదరణ కూడా అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడు తాజాగా ఇన్ స్టా మరో అదిరిపోయే అప్ డేట్ ను కూడా తీసుకువచ్చింది. అదేంటంటే ఇక నుంచి మూడు నిముషాల వీడియోలను కూడా రీల్స్ రూపంలో అప్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇన్ స్టాలో 90 సెకన్ల వీడియోలను మాత్రమే అప్ లోడ్ చేసే వెసలుబాటు ఉంది. కానీ ఇప్పుడు మరో 90 సెకన్లు పెంచేసింది.
ఈ విషయాన్ని ఇన్ స్టా హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు. ఆయన గతంలో దీన్ని అస్సలు పెంచబోమని తెలిపారు. కానీ ఇప్పుడు పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే ఇలా పెంచడానికి అసలు రీజన్ వేరే ఉంది. అమెరికాలో ఇప్పుడు టిక్ టాక్ ను బ్యాన్ చేశారు. టిక్ టాక్ లో ఇప్పటికే మూడు నిముషాల వీడియోను కూడా అప్ లోడ్ చేసుకునే వెసలుబాటు ఉంది. టిక్ టాక్ బ్యాన్ అయింది కాబట్టి ఆ యూజర్లను సంతృప్తి పరిచేందుకు ఇన్ స్టా గ్రామ్ ఈ కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. దీంతో మూడు నిముషాల కంటెంట్ ను ఈజీగా ఇందులో పోస్టు చేసుకోవచ్చు. యూజర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే దీన్ని మార్పు చేసినట్టు చెబుతున్నారు.
కానీ దీని వెనకాల టిక్ టాక్ యూజర్లు, క్రియేటర్లను ఇన్ స్టా పట్టేయడానికి బిజినెస్ ట్రిక్ ను వాడుతోందన్నమాట. ఈ దెబ్బతో టిక్ టాక్ ప్లేస్ ను ఇన్ స్టా రీప్లేస్ చేయబోతోంది.