Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బోడి సలహా’ అనగానేమి.?

ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.. వివిధ రాజకీయ పార్టీలతో దేశంలోని ‘కరోనా వైరస్‌ తీవ్రత’పై ఈ సమావేశంలో చర్చిస్తారు. దేశం గతంలో ఎన్నడూ లేని రీతిలో పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశమే కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ.. ఆ మాటకొస్తే భూమ్మీద మానవాళికే ముప్పులా పరిణమించింది ఈ కరోనా వైరస్‌. ఈ సమయంలో రాజకీయాలు అనవసరం. అధికారంలో వున్నవారెవరైనా బేషజాలు పక్కన పెట్టి, అందర్నీ కలుపుకుపోవాలి.

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. ఓ వైసీపీ నేత, ‘ఆయనగారి బోడి సలహాలు మాకు అవసరం లేదు..’ అంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడిని ఉద్దేశించి ఎద్దేవా చేసేశారు. అసలు ‘బోడి సలహా’ అంటే ఏంటి.? ‘కరోనా వైరస్‌కి పారాసిటమాల్‌ వేస్తే సరిపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే సరిపోతుంది..’ అని చెప్పడం నిజంగానే బోడి సలహా. ఈ పారాసిటమాల్‌ ఆలోచనతోనే, విదేశాల నుంచి వచ్చిన కొందరు.. ఎయిర్‌ పోర్టుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ల నుంచి బయటపడ్డారు.

సరే, కరోనా వైరస్‌కి ఇదీ వైద్య చికిత్స… అంటూ ప్రామాణికత ప్రస్తుతానికి లేదు గనుక, జ్వరానికి పారాసిటమాల్‌ వాడతారు.. ఇంకా ఎక్కవైతే.. రకరకాల మందులు వాడతారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం ద్వారా పరిసరాల్లో క్రిమి కీటకాలు, వైరస్‌లు, బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా వుంటుంది. అలాగని, వాటినే ట్రీట్‌మెంట్లుగా చెబితే ఎలా.? చైనా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ‘పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌’ తెలివితేటల్లేకనా ఆయా దేశాలు వేలాదిమంది ప్రజల ప్రాణాల్ని పోగొట్టుకున్నది.? ఇదే, ఈ పైత్యమే అధికార పార్టీ నేతలు తగ్గించుకుంటే మంచిది.

సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబునే కాదు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సలహాల్నీ తీసుకోవాలి. వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల్నీ కలుపుకుపోవాలి. సమాజంలో మేధావులతో చర్చించాలి, వైద్య నిపుణుల సూచనలు, సలహాల్ని తీసుకోవాలి.. కానీ, అంత చిత్తశుద్ధి, ప్రజల పట్ల బాధ్యత అధికార పార్టీకి ఎక్కడిది.? మొదట్లో బోడి సలహాలు ఇచ్చి, ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చాక.. అధికార పక్షం తల పట్టుక్కూర్చుంది. ఇంకా బేషజాలకు పోతే రాష్ట్రానికి వాటిల్లే నష్టం అంచనాలకతీతం.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

ఎక్కువ చదివినవి

రంజాన్‌ స్పెషల్‌: ఇఫ్తార్‌.. ఈ ఏడాదికి ఇంతే.!

ఇస్లాం మతంలో ఇఫ్తార్‌ విందుకి ఎంతో ప్రత్యేకత వుంది. రంజాన్‌ సీజన్‌లో ఇఫ్తార్‌ విందులు చాలా చాలా ప్రత్యేకమైనవి. ప్రభుత్వాలు సైతం ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటాయి అధికారికంగా. ముస్లింల ఓటు బ్యాంకు...

రానా బావా మీ తర్వాత నాదే : శ్రీరెడ్డి

శ్రీరెడ్డి టాలీవుడ్‌ ప్రముఖులపై చేసిన కామెంట్స్‌, ఆరోపణలను ఎవ్వరు మర్చిపోలేరు. సంచలన కామెంట్స్‌ చేసి సినీ ప్రముఖులను ఒక ఆట ఆడేసుకున్న శ్రీరెడ్డి ఈమద్య కాస్త సైలెంట్‌ అయ్యింది అనుకుంటే మళ్లీ అప్పుడప్పుడు...

ఫ్లాష్ న్యూస్: దూమ్ ధామ్ గా నిశ్చితార్థం.. 250 ఫ్యామిలీల దూల తీర్చేసిన కరోనా.!

లాక్‌డౌన్‌లో చావుకు పది మంది, పెళ్లికి 20 మంది అంటూ ప్రభుత్వాలు కండీషన్‌ పెట్టాయి. ఇప్పటికి కూడా అదే కండీషన్‌ అమలులో ఉంది. కాని కొందరు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు....

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...