Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: డాక్టర్‌ సుధాకర్‌ని లాఠీతో కొట్టారా.? లేదా.?

డాక్టర్‌ సుధాకర్‌.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ‘మత్తు డాక్టర్‌’గా అందరికీ సుపరిచితుడు. ఎప్పుడైతే ప్రభుత్వాసుపత్రుల్లో మాస్క్‌లు అందుబాటులో లేవనీ, అధికార పార్టీ నేతలే వాటిని కాజేస్తున్నారనీ ఆరోపించారో.. ఆ వెంటనే ఆయన్ని విధుల నుంచి తొలగించింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీతో డాక్టర్‌ సుధాకర్‌కి లింకులు అంటగట్టడం చూశాం. ఇప్పుడు అదే డాక్టర్‌, రోడ్డు మీద మద్యం సేవించి నానా హంగామా చేశాడు.

ప్రస్తుతం ఆయన మానసిక స్థితి బాగాలేదంటూ ‘మెంటల్‌ హాస్పిటల్‌’కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ వ్యవహారానికి సంబంధించి రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తోంది. డాక్టర్‌ సుధాకర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని బూతులు తిట్టింది వాస్తవం. మద్యం మత్తులో వున్నాడని అధికారులే చెబుతున్న దరిమిలా.. తాగినోడి వాగుడి గురించి ఏం మాట్లాడగలం.?

అయితే, ఇక్కడ పోలీసులు ఏం చేశారన్నదే కీలకం. ‘మేం అసలు లాఠీలతో కొట్టలేదు..’ అని సాక్షాత్తూ ఓ ఉన్నతాధికారి సెలవిచ్చారు. కానీ, వీడియోల్లో స్పష్టంగా ఓ కానిస్టేబుల్‌, డాక్టర్‌ సుధాకర్‌ని లాఠీతో చితకబాదుతున్న వైనం కన్పిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.

ఇది కాక, చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. చేతుల్ని కట్టేశారు, రోడ్డు మీద పడేశారు.. ఇష్టమొచ్చినట్లుగా తన్నారు. తన్నినవారిలో పోలీసులతోపాటు, అధికార పార్టీ కార్యకర్తలు కూడా వుండడం గమనార్హం. అమానవీయంగా ప్రవర్తించిన ఓ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నట్లు పోలీసు శాఖ చెబుతోంటే, అసలు కొట్టలేదని పోలీస్‌ ఉన్నతాధికారి చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోగలం.?

కొన్నాళ్ళ క్రితం, అమరావతిలో మహిళలపై పోలీస్‌ ఉన్నతాధికారులు లాఠీలు ఝుళిపించినప్పుడూ ఇదే తరహా బుకాయింపుల్ని చూశాం. న్యాయస్థానం మొట్టికాయలేశాక.. లాఠీల ప్రతాపం కొంత తగ్గింది. పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు లాఠీలకు పనిచెబితే.. దాన్ని మరీ అంత తీవ్రంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ, మతి స్థిమితం కోల్పోయాడనీ, మద్యం మత్తులో వున్నాడని పోలీసులే చెబుతూ, డాక్టర్‌ సుధాకర్‌ మీద ఎందుకు లాఠీ ఝుళిపించినట్లు.?

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్...

ఫ్లాష్ న్యూస్: బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారంతో సీబీఎస్‌ఈ కొత్త గైడ్‌ లైన్స్‌

దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అసభ్యకరమైన వీడియోలు...

జగన్‌ సర్కార్‌కి ఝలక్‌: డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి.!

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో మద్యంతర నివేదిక అందించాలని ఈ...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...