చేబ్రోలు కిరణ్ కుమార్.. ఈ పేరు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. నిఖార్సయిన టీడీపీ కార్యకర్త.. అంటూ, తెలుగు తమ్ముళ్ళు, తోటి కార్యకర్తకు మద్దతుగా నిలుస్తున్నారు. వైఎస్ భారతి మీద ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఓ యెత్తు.. టీడీపీ పట్ల ఆయన అంకిత భావం ఇంకో యెత్తు.. అన్నది తెలుగు తమ్ముళ్ళ ఆవేదన.
అసలు, మొహాన్ని కవర్ చేసి, టెర్రరిస్టులా చేబ్రోలు కిరణ్‌ని పోలీసులు, మీడియా ముందు ప్రవేశ పెట్టడమేంటి.? అంటూ, తెలుగు తమ్ముళ్ళు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుండడం నిజంగానే ఆశ్చర్యకరం. పైగా, చేబ్రోలు కిరణ్ ఆర్థిక పరిస్థితిని చూసి తెలుగు తమ్ముళ్ళు చలించిపోతున్నారు.
చేబ్రోలు కిరణ్ కుటుంబానికి ఆర్థికంగా అండదండలు అందించడం తమ బాధ్యత అని, ఎన్నారై తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు, ఆర్థిక సాయం అందిస్తున్నారు కూడా. ఇది నిజంగానే ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే.
‘శ్రీరెడ్డి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడిందో చూశాం. శ్రీరెడ్డిని అరెస్టు చేయగలిగామా.? శ్రీరెడ్డిని అరెస్టు చేయనప్పుడు, చేబ్రోలు కిరణ్‌ని ఎలా అరెస్ట్ చేస్తాం.?’ అంటూ తమ ప్రభుత్వాన్ని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, చేబ్రోలు కిరణ్ కుమార్ ఎప్పుడు బయటకు వచ్చినా చంపేస్తామంటూ, వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డెత్ థ్రెట్స్ ఇస్తున్నారు.
ఓ సాధారణ కార్యకర్త తప్పు చేస్తే, ఇదిగో ఇలాంటి పరిస్థితులే వుంటాయ్. అందుకే, పార్టీల జెండాలు పట్టుకునేటప్పుడు, సంయమనం పాటించండి.. అన్న చర్చ అయితే, చేబ్రోలు కిరణ్ అరెస్టు వ్యవహారంతో అన్ని పార్టీల కార్యకర్తల్లోనూ జరుగుతోంది.
అలానే, చేబ్రోలు కిరణ్ అరెస్ట్ తర్వాత, అప్పటికప్పుడు కలిగిన ఆగ్రహంతో కొందరు టీడీపీ కార్యకర్తలు, టీడీపీకి దూరమవుతున్నట్లు ప్రకటించినా, చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించి, అరెస్టయిన గోరంట్ల మాధవ్ వ్యవహారంతో.. తమ మనసు మార్చుకుంటున్నారు వారంతా