Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: దెబ్బతింటోన్న విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. నిజానికి విశాఖ, ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక రాజధాని. ఉమ్మడి తెలుగు రాష్ట్రం హైద్రాబాద్‌ తర్వాతి స్థానం విశాఖదే. దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత కూడా విశాఖ అభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టలేదు. చంద్రబాబు హయాంలో విశాఖ చుట్టూ చాలా పబ్లిసిటీ స్టంట్లు నడిచాయి. ఇప్పుడూ దాదాపుగా అదే జరుగుతోంది.

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చూస్తోంది. అయితే, అందులో చిత్తశుద్ధి ఎంత.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నేనంటారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా వుంటే, విశాఖలో ఇటీవలే ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నుంచి విషవాయువులు లీక్‌ అవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంస్థలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖుడి బంధువు కీలక ‘పొజిషన్‌’లో వున్నాడనే ఆరోపణలు అప్పట్లో విన్పించిన విషయం విదితమే. ఆ కారణంగానే, హుటాహుటిన ముఖ్యమంత్రి విశాఖ వెళ్ళారనీ, మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించారనీ విపక్షాలు విమర్శించాయి. అయితే, దేశాన్ని కుదిపేసిన ఆ దుర్ఘటన, విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీసిందన్నది నిర్వివాదాంశం. ‘ఇంకోసారి ఇలాంటి ఘటన రాష్ట్రంలో జగరకుండా చర్యలు తీసుకుంటాం..’ అని ప్రభుత్వం ప్రకటించింది.

కానీ, ఇటీవలే కర్నూలులో ఓ పరిశ్రమలో విషవాయువు లీక్‌ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా విశాఖలోనే సాయినార్‌ పరిశ్రమలో విషవాయువు లీక్‌ అవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరి, ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు ఇచ్చినట్లే కోటి పరిహారం, మిగతా రెండు ఘటనల్లోనూ మృతుల కుటుంబాలకు అందుతుందా.? లేదా.? ఈ విషయమై ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు.

సరే, పరిహారం.. ఇతరత్రా రాజకీయాల సంగతి పక్కన పెడితే, విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ మాటేమిటి.? ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను మార్చుతామంటోన్న ప్రభుత్వం, విశాఖలో పరిశ్రమల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.? యుద్ధ ప్రాతిపదికన పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహిస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం, ఆ తనిఖీలు నిర్వహించిందా.? లేదా.? నిర్వహిస్తే సాయినార్‌ పరిశ్రమలో ఎందుకు ప్రమాదం చోటు చేసుకుంది.? చిన్న చిన్న ప్రమాదాలు వేరు.. ప్రమాదకర వాయువులు లీక్‌ అవడం వేరు. ప్రమాదకర వాయువులు లీక్‌ అయితే.. ఆ ప్రభావం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏదిఏమైనా, విశాఖ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వుంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా వున్న విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌పై ఇలాంటి ఘటనల ద్వారా దెబ్బ పడితే.. అది రాష్ట్రానికే తీవ్ర నష్టం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

రాజకీయం

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఎక్కువ చదివినవి

వైయస్ షర్మిల వియ్యంకుల వ్యాపారాలపై ఐటి దాడులు

హైదరాబాద్ లోని ప్రముఖ అల్పాహార హోటల్ సంస్థ 'చట్నీస్' పై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు చేశారు. భాగ్యనగరం వ్యాప్తంగా 'చట్నీస్' హోటల్ కి ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. ఈ సంస్థ అధినేత...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

అవునా.. నిజమా..పవన్ కళ్యాణ్ అంటే అంత భయమా!

అవునే.. నిజమే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చూసి వైసీపీ భయపడుతున్నట్టే కనిపిస్తోంది. జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురం లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ భారీ ఎత్తున ఖర్చు పెడుతుందట....