Switch to English

ఇన్ సైడ్ స్టోరీ: వారు.. ఎవరికీ పట్టని నాలుగో సింహాలు!

ప్రపంచానికి పెను సవాల్ గా మారిన కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. మానవజాతి ఎప్పుడూ చూడని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రాజు, పేద, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరినైనా ఈ మహమ్మారి కలుపుకొని పోతోంది. దీనిని నిరోధించేందుకు పోరాడుతున్న యోధుల్లో వైద్య సిబ్బందితోపాటు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ముందు వరుసలో ఉన్నారు. వీరినే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటున్నారు. వీరితోపాటు కనిపించిన నాలుగో సింహం కూడా ఒకటి ఉంది. వారే పాత్రికేయులు. అందరూ ఆ ముగ్గురి గురించే మాట్లాడతారు తప్ప వీరి గురించి ఎవరూ మాట్లాడే పరిస్థితే ఉండదు.

లాక్ డౌన్ విధించినా, కర్ఫ్యూ పెట్టినా పాత్రికేయులు మాత్రం పని చేయక తప్పదు. అందరికీ పండగ రోజుల్లో సెలవు ఉంటుంది. కానీ జర్నలిస్టులకు మాత్రం ఉండదు. ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళతారో, తిరిగి ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఇంత చేస్తున్నా కనీస భద్రత కూడా లేని బతుకులు వారివి. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని దుస్థితి. అయినప్పటికీ విధి నిర్వహణలో పలువురు పాత్రికేయులు చూపించే చిత్తశుద్ధిని ఏ మాత్రం తక్కువ చేయలేం. అన్నిచోట్లా మంచి, చెడు ఉన్నట్టే.. జర్నలిజంలోనూ ఈ రెండూ ఉన్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా చాకచక్యంగా నాలుగు రాళ్లు వెనకేసుకునేవారు కూడా ఈ రంగంలో ఉన్నారు.

అదే సమయంలో రెక్కలు ముక్కలు చేసుకుని నాలుగు రాళ్లు కొడితే ఎంత వస్తుందో అంత కూడా సంపాదించలేని వారూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటివారే ఎక్కువ. ప్రస్తుత కరోనా కాలం పాత్రికేయులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వాలు.. పాత్రికేయులను మాత్రం తమకు సంబంధం లేనివారిగా పక్కన పెట్టేశాయి.

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ధీటుగా తమ విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించకపోవడం వారి దుస్థితికి నిదర్శనం. కరోనాకు చికిత్స చేసే ఆస్పత్రులతోపాటు రెడ్ జోన్లు, హాట్ స్పాట్ల వంటి ప్రాంతాల్లో జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా తిరగాల్సి వస్తోంది. దీంతో కరోనా బారిన పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులోని ఓ ఛానల్ కు చెందిన 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫీల్డ్ లో తిరిగి వచ్చిన రిపోర్టర్ల కారణంగా డెస్క్ సిబ్బందీ వైరస్ బారిన పడ్డారు. అలాగే ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వచ్చింది.

తాజాగా తెలంగాణలోనూ పలువురి పాత్రికేయులను క్వారంటైన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పాత్రికేయుల్లోనే కాస్త కదలిక వచ్చింది. మనల్ని ఎవరూ కాపాడరు.. మనల్ని మనమే కాపాడుకోవాలని జర్నలిస్టు సర్కిళ్లలో మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి. మనకు ఏమైనా అయితే, ఎవరూ ఆదుకోరనే విషయం గుర్తుంచుకోవాలంటూ పలువురు తమ తోటి పాత్రికేయులను హెచ్చరిస్తున్నారు. ‘‘రోజూ విధి నిర్వహణ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తుంటే చుట్టుపక్కలవారు అభ్యంతరం చెబుతున్నారు. కొంతమంది ఇంటి యజమానులు అయితే గేటుకు తాళాలు వేసేస్తున్నారు. పోనీ ఇంట్లోనే ఉందామంటే కుదరని పరిస్థితి.

అసలే ప్రస్తుతం మీడియాలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వేళకు ఆఫీసుకు వెళ్లకపోతే ఏమవుతుందనే భయం. వెళ్తే.. ఇంటి యజమానులు, చుట్టుపక్కలవారి అభ్యంతరాలు. ఏం చేయాలో అర్థం కావడంలేదు’’ అన్న ఓ మీడియా మిత్రుడి ఆవేదన చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రజ్యోతి, వెలుగు వంటి పత్రికల్లో సిబ్బందికి ‘సెలవులు’ ఇచ్చేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తాం.. ప్రస్తుతానికి రావొద్దని సాగనంపేశారు. ఒకటి రెండు టీవీ ఛానళ్లు పలువురి కొలువులకు నేరుగానే ఉద్వాసన పలకగా.. మరొకొన్ని చిన్న ఛానళ్లు వేతనాల్లో 25 శాతం కోత పెట్టాయి. దీంతో రాబోయే కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయో, ఎంతమందికి ఊడతాయో అని పాత్రికేయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

నిజానికి కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగులు తొలగింపు ప్రక్రియను చేపట్టాలని పలు సంస్థలు గతంలోనే భావించాయి. అలాంటివారికి కరోనా అనుకోని వరంలా వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సాకుతో తాము చేయాలనుకున్న పనులన్నీ ఇప్పుడు చేస్తున్నాయని జర్నలిస్టు వర్గాలే ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. మొత్తానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా విరజిల్లాల్సిన మీడియాలో ఎవరికీ పట్టని నాలుగో సింహంలా పాత్రికేయుల పరిస్థితి మారిపోయింది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

లారెన్స్ సినిమాకి ‘లక్ష్మీ బాంబు’ లాంటి ఆఫర్

ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో విధాలుగా నష్టాలను ఎదుర్కుంటున్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. థియేటర్లు మూతపడి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టబోతుంటే చిత్రీకరణలు లేక చిన్న స్థాయి నటీనటులు, రోజు...

బర్త్‌డే స్పెషల్‌ : తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దిన సినీ శాస్త్రవేత్త

తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే, తెలుగు సినిమా చరిత్ర గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడటం అసాధ్యం. తెలుగు సినిమా అనే ప్రయోగశాలలో కృష్ణ ఎన్నో ప్రయోగాలు...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

పెళ్లి చేసుకుని నాలుగు రోజులకే పారిపోయిన వరుడు

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంకు చెందిన వీరాకుమార్‌ ఇటీవలే అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌లోనూ వైభవంగా పెళ్లి చేసుకున్న వీరకుమార్‌ అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో పెళ్లి అయిన నాలుగు...