Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: టీడీపీ గ్రాఫ్‌ కిందికి.. జనసేన గ్రాఫ్‌ పైపైకి.!

2019 ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి చెంప పెట్టు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అధికారం కోల్పోవడం ఓ ఎత్తయితే.. అత్యంత ఘోరమైన పరాజయం ఇంకో ఎత్తు. మామూలుగా అయితే, ఏ పార్టీ అయినా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కానీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ గడచిన ఏడాది కాలంలో మరింతగా తన స్థాయిని దిగజార్చేసుకుంది తప్ప, ప్రతిపక్షంగా తన ఉనికిని సమర్థవంతమైన రీతిలో చాటుకోలేకపోయింది. టీడీపీతో పోల్చితే జనసేన – బీజేపీ, వామపక్షాలు కాస్తో కూస్తో సమర్థవంతంగా అధికార పార్టీపై పోరాడగలుగుతున్నాయి.

ప్రతి విషయంలోనూ టీడీపీ యాగీ చూస్తోంటే వైసీపీ – టీడీపీ మధ్య ’60-40’ ఒప్పందాలకు అనుకుణంగానే జరుగుతున్నాయా.? అన్న అనుమానం కలగకమానదు. ప్రజా వేదికను కూల్చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇప్పటిదాకా చంద్రబాబు నివాసముంటోన్న గెస్ట్‌ హౌస్‌ని ఖాళీ చేయించలేకపోవడమే ఇందుకు నిదర్శనం. కృష్ణా నదికి వరదలొస్తే, ఆ వరదల పేరుతో టీడీపీ – వైసీపీ చేసిన రాజకీయ యాగీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమరావతి పేరుత చంద్రబాబు సర్కార్‌ కుంభకోణాలకు పాల్పడిందని గతంలో ఆరోపించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక అవే ఆరోపణల్ని కొనసాగించింతి తప్ప.. ఇంతవరకు చంద్రబాబుపైగానీ, ఆయన తనయుడు లోకేష్‌పైనగానీ చర్యలు తీసుకోలేకపోయాయి. ఇలాంటివన్నీ వైసీపీ – టీడీపీ మధ్య ‘కుమ్మక్కు’ రాజకీయాల్ని స్పష్టం చేస్తున్నాయన్న వాదన జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. ఇక, అమరావతి విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. జనసేన పార్టీ ఖచ్చితమైన వ్యూహాలతో ముందడుగు వేస్తోంది.

పార్టీకి వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే చేజారిపోయినా, జనసేన ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. ఇసుక కొరత నేపథ్యంలో భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడితే, వారికి అండగా నిలిచింది జనసేన పార్టీ. ఇలా ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా మారుతోంది జనసేన. ఇక, జనసేన మిత్రపక్షమైన బీజేపీ, ఒక్కోసారి వైసీపీకి అనుకూలంగా ఒక్కోసారి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నా, జనసేన మాత్రం మిత్రపక్షం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడం గమనార్హం. ఎలా చూసినా, గడచిన ఏడాది కాలంలో ప్రతిపక్షం టీడీపీ తన గ్రాఫ్‌ని పూర్తిగా పడగొట్టేసుకుంది. రానున్న రోజుల్లో టీడీపీ గ్రాఫ్‌ మరింత తగ్గుతుందని, జనసేన గ్రాఫ్‌ ముందు ముందు పెరగబోతోందనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.

కరోనా వైరస్‌ విషయంలో జనసేన పార్టీ ప్రదర్శించిన రాజకీయ సంయమనాన్ని రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు జనసేన నేతలు మీడియాలోనూ యాక్టివ్‌ అవుతున్నారు. మీడియా చర్చా కార్యక్రమాల్లో పదునైన వాదనలు విన్పిస్తున్నారు. ఇదివరకు పవన్‌ తప్ప ఇంకెవరి వాయిస్‌ గట్టిగా విన్పించేది కాదు. గ్రౌండ్‌ లెవల్‌లోనూ జనసేన పార్టీ రోజురోజుకీ బలం పుంజుకుంటోంది. ఇక, ప్రతిపక్షం టీడీపీ విషయానికొస్తే.. పార్టీలో కీలక నేతలు, పార్టీ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయినట్లే కన్పిస్తోంది.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...

క్రైమ్ న్యూస్: క్వారంటైన్లో ఉండమన్నందుకు చంపేశారు..

కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉంటూ ఇతరులను జాగ్రత్తగా ఉంచాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని వివరించి క్వారంటైన్ లో ఉండమన్నందుకు తనతో పాటు మరో వ్యక్తి బలైపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దారుణమైన...

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...

ఫ్లాష్ న్యూస్: ఇంట్లోకి పాములు వస్తున్నాయని ఊరు వదిలి పెట్టారట

కంప్యూటర్ కాలంలో కూడా కొందరు మూఢ నమ్మకాలు పాటిస్తూ, వాటిని నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ భీందు జిల్లాలో జరిగిన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంట్లో దాదాపుగా 120...

తిరుపతి లడ్డూ అమ్మకంపై రమణ దీక్షితులు అసహనం

రమణ దీక్షితులు.. చంద్రబాబు హయాంలో ‘ఉద్యోగం’ కోల్పోయిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడీయన. అప్పట్లో రమణ దీక్షితులు చేసిన పొలిటికల్‌ యాగీ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆయన అప్పటి ప్రతిపక్ష...