Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: విశాఖ మెట్రో – పబ్లిసిటీ స్టంట్‌ కాదు కదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

హైద్రాబాద్‌ మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి మరో లైన్‌ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. కొత్త రూట్‌ రాకతో, మొత్తంగా మూడు ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ళు నగరవాసులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి మార్గం సుగమం అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కొత్త లైన్‌లో మెట్రో రైలుకి పచ్చజెండా ఊపారు.. అదే రైల్లో ప్రయాణించారు కూడా. సరిగ్గా అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో ‘మెట్రో ప్రాజెక్టు’కి సంబంధించి కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అదే విశాఖ మెట్రో ప్రాజెక్టుకి డీపీఆర్‌ రూపకల్పన చేయాలని అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించడం.

ఈ ప్రాజెక్టు కోసం కొటేషన్లు పిలవాలని అమరావతి మెట్రో రైల్‌ ఎండీని ప్రభుత్వం ఆదేశించడం ద్వారా విశాఖ మెట్రో ప్రాజెక్టులో కదలిక వచ్చిందని అనుకోవచ్చు. గతంలో.. అంటే, చంద్రబాబు హయాంలో విశాఖ మెట్రో ప్రాజెక్టుకి బీజం పడింది. విశాఖతోపాటు విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టునీ అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. అమరావతి మెట్రో రైల్‌ పేరుతో విజయవాడ నుంచి అమరావతి వరకూ మెట్రో రైలు ప్రాజెక్టుని చేపట్టాలన్నది చంద్రబాబు సర్కార్‌ చేసిన ఆలోచన. అయితే, దానికి నానా రకాల ఇబ్బందులూ తలెత్తాయి. కేంద్రం రకరకాల కొర్రీలు పెట్టింది. చివరికి విజయవాడ మెట్రో దాదాపుగా అటకెక్కేసింది.

రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించనున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌, విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఫోకస్‌ పెట్టింది. నిజానికి మెట్రో ప్రాజెక్టు అంటే అంత సులువైన వ్యవహారం కాదు. వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టు అది. దీనికోసం భూ సమీకరణ మరో పెద్ద సమస్య. విశాఖ లాంటి నగరంలో ఈ ప్రాజెక్టు మరీ కష్టమైన వ్యవహారమన్నది విశ్లేషకుల అభిప్రాయం. పైగా, అక్కడ మెట్రో రైలుని ఎంతమంది ఆదరిస్తారన్నది ఇంకో సమస్య.

హైద్రాబాద్‌లోనే మెట్రో రైలు విషయమై చాలా అనుమానాలున్నాయి. అన్నట్టు, ఏకంగా 79.9 కిలోమీటర్ల మేర మెట్రో రైలుని విశాఖలో ప్రతిపాదిస్తున్నారు. దానికి తోడు, 60 కిలోమీటర్ల మేర ట్రావ్‌ు సర్వీసులు కూడానట. చూస్తోంటే, ఇదేదో పబ్లిసిటీ స్టంట్‌ అన్పించకమానదు. మెట్రో లాంటి ప్రాజెక్టుల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించాలి. కానీ, రాష్ట్రం విషయంలో కేంద్రం చూపిస్తున్న సవతి ప్రేమ దృష్ట్యా.. విశాఖ మెట్రో సాధ్యమయ్యే పనేనా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

Ram Charan : చరణ్‌ బర్త్‌డేకి ముచ్చటగా మూడు…!

Ram Charan : మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 27న ఆయన ఫ్యాన్స్ తో...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...