Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: విశాఖపై విష పంజా.. ఇదే ‘కొత్తది’ కాదు.!

విశాఖపట్నం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అది అందమైన నగరం అని అంతా చెబుతుంటారు. అది నిజం కూడా. పొడవైన తీరం విశాఖ సొంతం. అందమైన కొండలు, ఎర్రమట్టి దిబ్బలు.. ఇలా విశాఖ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, ఆ విశాఖ ఘనతల్లో ‘కాలుష్యం’ కూడా ఒకటి.

విశాఖ పోర్ట్‌ సహా, విశాఖలో కొలువుదీరిన పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం.. విశాఖ నగరంపై ఎప్పటికప్పుడు పంజా విసురుతూనే వుంది. కాలుష్యం నుంచి తమను కాపాడాలంటూ విశాఖ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. కానీ, కాలుష్యం నుంచి విశాఖను బయటపడేసేందుకు ఏ ప్రభుత్వమూ ప్రయత్నించిన దాఖలాల్లేవు.

పైగా, నిబంధనలకు నీళ్ళొదిలి ప్రమాదకరమైన రసాయన కర్మాగారాల్ని నిర్వహించడం సర్వసాధారణమైపోయింది విశాఖలో. రాజకీయ ఒత్తిళ్ళే దీనికి ప్రధాన కారణం. తాజాగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ అనే పరిశ్రమ నుంచి విష వాయువులు వెలువడ్డాయి. వందల మంది ఈ విష వాయువుల ప్రభావానికి గురయ్యారు.

వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో బాధితులు వుంటారనే ప్రచారం జరుగుతోంది. ‘విశాఖలో పరిశ్రమల కాలుష్యంపై ప్రజా ప్రతినిథులకు మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రాజకీయ నిర్లక్ష్యమే ఇప్పుడు మా ప్రాణాల్ని హరించేస్తోంది..’ అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.

విశాఖపట్నంను ఐటీ క్యాపిటల్‌గా మార్చుతామని చంద్రబాబు హయాంలో నానా హంగామా నడిచింది. కానీ, విశాఖలో అభివృద్ధి శూన్యం. ఇప్పుడు విశాఖని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అంటున్నారు. దురదృష్టం.. విశాఖ ఇప్పుడు విషం చిమ్మే పరిశ్రమలకు క్యాపిటల్‌గా మారింది. దేశమంతా ఇప్పుడు విశాఖ గురించే చర్చించుకుంటోంది. పాలకులు విశాఖపట్నంకి బోల్డంత పేరు తీసుకొస్తున్నారు.. అది ‘చెడ్డ పేరు’ కావడమే బాధాకరం.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

జస్ట్‌ ఆస్కింగ్‌: టీటీడీ శ్వేతపత్రంలో ‘పింక్‌’ డైమండ్‌ వుంటుందా.?

పింక్‌ డైమండ్‌.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించి భక్తులు సమర్పించుకున్న అతి విలువైన వాటిల్లో ఇదీ ఒకటంటూ గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ప్రచారం మాత్రమే కాదు, దీని చుట్టూ జరిగిన...

బర్త్‌డే స్పెషల్‌ : మణిరత్నం కెరీర్‌ టాప్‌ 5 బెస్ట్‌ చిత్రాలు

సౌత్‌ ఇండియా సినిమా స్థాయిని బాలీవుడ్‌ రేంజ్‌కు పెంచిన మొదటి తరం దర్శకుడు మణిరత్నం. సౌత్‌ సినిమాలు అంటే చిన్న చూపు చూస్తున్న సమయంలో మణిరత్నం చేసిన సినిమాలు బాలీవుడ్‌ మేకర్స్‌ దృష్టిని...

అద్దె చెల్లించలేదని గన్‌తో కాల్చి చంపేసిన ఇంటి యజమాని

గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రైవేట్‌ ఉద్యోగస్తులు ఆదాయం లేక కనీసం తిండికి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర...

కారు యాక్సిడెంట్‌లో 22 ఏళ్ళ నటి మృతి

ఈమద్య కాలంలో సినిమా ఇండస్ట్రీ మరియు బుల్లి తెర ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు మృతి చెందడం ఆత్మహత్య చేసుకోవడం గురించి వార్తల్లో పదే పదే చూస్తూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో నటి...

యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ని భయంతో దాక్కునేలా చేసిన దాడులు.!

అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసించిన అమెరికా ఓ వైపు కరోనా వైరస్ తో సతమతమవుతున్న టైంలో ఫ్లాయిడ్ ను ఓ తెల్లజాతి పోలీస్ తన మోకాలితో మెడపై బలంగా తొక్కిపెట్టి జార్జ్ ఫ్లాయిడ్ అనే...