Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: అమరావతిలో ‘రైతు’ వర్సెస్‌ ‘పోలీస్‌’.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని చంద్రబాబు హయాంలో నిర్ణయించడం, దాన్ని వైఎస్‌ జగన్‌ హయాంలో మార్చేందుకు ప్రయత్నిస్తుండడం.. ఈ నేపథ్యంలో నానా యాగీ జరుగుతోందక్కడ. ఒకటి కాదు, ఏకంగా రాష్ట్రానికి మూడు రాజధానులని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీర్మానించింది. అసెంబ్లీలో పాస్‌ అయిన ఈ తీర్మానం, శాసన మండలి దగ్గర ఆగింది. శాసన మండలిని రద్దు చేస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీర్మానం చేసినా.. దానికి కేంద్రం ఆమోద ముద్ర వేయాలి. మరోపక్క, మూడు రాజధానుల వ్యవహారం కోర్టు పరిధిలోకి కూడా వెళ్ళింది.. శాసన మండలి రద్దు తదితర అంశాల నేపథ్యంలో.

ఇదిలా వుంటే, రెండు నెలలకు పైగా ఏకబిగిన అమరావతి కోసం భూములిచ్చిన రైతులు.. ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని’ అనే నినాదంతో ఉద్యమిస్తోంది. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తోంది. అలా పోలీసులకీ, రైతులకీ మధ్య గత రెండు నెలలుగా ‘ఘర్షణ’ వాతావరణం కన్పిస్తోంది. ‘మేం శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నాం..’ అని రైతులు చెబుతున్నారు. ‘శాంతియుత ఆందోళనలకు సహకరిస్తున్నాం..’ అని పోలీసులు చెబుతున్నారు. శాంతియుత నిరసనలకు సహకరిస్తోంటే, ఉన్నతాధికారులు సైతం లారీÄలు ఎందుకు ఝుళిపిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.

కోర్టు సైతం ఈ విషయమై ఇప్పటికే పోలీసు శాఖకు చీవాట్లు పెట్టిన విషయాన్ని మర్చిపోలేం. అయితే, అమరావతి రైతులకు అండగా వుంటున్నట్లు చెబుతోన్న టీడీపీ శ్రేణులు కొంత అలజడికి కారణమవుతున్న మాట కూడా వాస్తవమే. పోలీసులు, ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు తగ్గట్లు నడుచుకోవాల్సిందే. అలా ప్రభుత్వ పెద్దలు ఆదేశించబట్టే, మొదట్లో పోలీసులు మరీ అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు జోక్యంతో పోలీసుల హంగామా కొంత తగ్గినా, అడపా దడపా.. పోలీసుల ‘ఓవరాక్షన్‌’ మాత్రం కొనసాగుతూనే వుందని రైతులు చెబుతున్నారు.

ఇన్ని రోజులపాటు ఉద్యమం ఇంత శాంతియుతంగా జరగడం కాస్తంత ఆశ్చర్యకరమైన విషయమే. అధికార పార్టీ నేతలు ఎంత రెచ్చగొడుతున్నా.. రైతులు మాత్రం సంయమనం కొనసాగిస్తుండడమే.. ఉద్యమం ఈ స్థాయి దాకా రావడానికి కారణం. అయితే, ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు చేస్తున్న ఆరోపణలు, మొత్తం పోలీస్‌ వ్యవస్థ పరువుని బజార్న పడేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. ఆ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న విషయాలు నమ్మశక్యంగా లేకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయమిక్కడ.

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

ప్రేమ పెళ్లి పేరుతో కోటి లాగేసిన కి‘లేడీ’

ఈమద్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు చాలా ఎక్కువ అయ్యాయి. అయినా కూడా కొందరు గుడ్డిగా ఆన్‌ లైన్‌లో పరిచయం అయిన వారిని నమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఉప్పలపాటి చైతన్య విహారి...

జగన్‌ సర్కార్‌కి మరో షాక్‌: ఎస్‌ఇసిగా నిమ్మగడ్డకు లైన్‌ క్లియర్‌

వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మరో షాక్‌ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం...

భార్య భర్తలకు కిమ్‌ ఉరిశిక్ష.. క్రూరత్వంకు పరాకాష్ఠ

ఉత్తర కొరియా నియంత పాలకుడు కిం జోంగ్‌ ఉన్‌ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, తన గురించి తప్పుడు ప్రచారం చేసిన వారిని కనీసం కేసు...

ఫొటోటాక్‌ : రకుల్‌ ఈసారి మొత్తం బటన్స్‌ విప్పేసింది

హాట్‌ మద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈమద్య కాలంలో ఆఫర్లు లేకుండా పోయాయి. తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు రెండు మూడు సంవత్సరాలు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గడిపిన...

యాప్స్ తీసేస్తే చైనా దారికొస్తుందా?

కరోనా వైరస్ కు కారణమైన చైనాపై చాలా దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. డ్రాగన్ కంట్రీని ఆంక్షల చట్రంలో బంధించాలని అమెరికా తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశం నుంచి తమ కంపెనీలను ఉపసంహరిస్తోంది....