Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: చిరంజీవికి వైసీపీ వెన్నుపోటు.?

సినీ పరిశ్రమ నుంచి పెద్దలెవరూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ప్రత్యక్షంగా కలిసి అభినందించేందుకు ముందుకు రాని సమయంలో, మెగాస్టార్‌ చిరంజీవి.. తనంతట తానుగా అమరావతికి వెళ్ళి కలిసిన విషయం విదితమే. అప్పట్లో చిరంజీవిని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, దాన్ని చిరంజీవి స్వాగతించారు.

ఆ సమయంలో వైసీపీ శ్రేణులు చిరంజీవిని ఓ రేంజ్‌లో వెనకేసుకొచ్చాయి. అయితే, చిరంజీవి మీద వైసీపీ ‘ప్రేమ’ ఓ భూటకం అని తేలిపోయింది. అదంతా, జనసేనను దెబ్బ కొట్టే ప్రయత్నమని స్పష్టమయిపోయింది. అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి ఇంటి యెదుట ఈ నెల 29న ధర్నా.. అంటూ సోషల్‌ మీడియాలో ఓ ప్రచారం షురూ అయ్యింది ఇటీవలి కాలంలో. దీన్ని వైసీపీ శ్రేణులు ఎడా పెడా సర్క్యులేట్‌ చేశాయి. టీడీపీలో చిరంజీవిని వ్యతిరేకించేవారు ‘అగ్నికి ఆజ్యం పోసినట్లు’ ఈ వివాదాన్ని మరింత రాజేశారు.

అయితే, అమరావతి జేఏసీ మాత్రం.. తాము అలాంటి ఆందోళన ఏదీ చిరంజీవి ఇంటి ముందు చేయాలని నిర్ణయించుకోలేదని, ఆ ప్రచారంతో తమకు సంబంధం లేదని తేల్చేసింది. ఇప్పుడే అసలు కథ మొదలయ్యింది. సదరు ప్రచారం తాలూకు మూలాలు వైసీపీతోనే ముడిపడి వున్నట్లు సోషల్‌ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవికి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం.. అంటూ లీకులు అందడం.. ఇదే విషయమై ప్రధానితోనూ, కేంద్ర హోంమంత్రితోనూ వైఎస్‌ జగన్‌ చర్చించారంటూ లీకులు రావడం.. ఇవన్నీ చిరంజీవిని వెన్నుపోటు పొడిచే ప్రక్రియలో భాగంగా జరిగినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాగా, తనను రాజకీయాలతో ముడిపెట్టడం పట్ల చిరంజీవి ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారట. తన దృష్టి పూర్తిగా సినిమాల మీదనే వుందని చిరంజీవి, తన సన్నిహితుల వద్ద తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

కరోనా ఎఫెక్ట్‌ : ఇండియాను బ్యాన్‌ చేసిన జపాన్‌

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వందల దేశాల్లో కరోనా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు విదేశాలతో పూర్తి సంబంధాలను కట్‌ చేసుకున్నాయి. జపాన్‌ దేశంకు ప్రతి ఏడాది లక్షలాది మంది టూరిస్టులు...

చైనాతో యుద్ధమా.? రాజకీయాలొద్దు ప్లీజ్‌.!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ చైనా - భారత్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనాలోనే పుట్టిన కరోనా వైరస్‌ పట్ల అగ్రరాజ్యం అమెరికా గుర్రుమంటోన్న విషయం విదితమే. అసలు ఆ...

తీవ్ర అసహనంలో మహేష్.. కారణమేంటి?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అసహనంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ కూల్ గా ఉండే మహేష్, ఈ లాక్ డౌన్ సమయంలో కూడా కుటుంబ సభ్యులతో తన ఫ్రీ టైమ్...

ప్రపంచ రికార్డు దక్కించుకున్న బుట్టబొమ్మ

అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాదిలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌, పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే....

స్థానిక ఎన్నికలకు ఫ్రెష్‌ నోటిఫికేషన్‌: జనసేన డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు రసాభాసగా ప్రారంభమైన విషయం విదితమే. ఈ క్రమంలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చోట్ల రక్తసిక్తంగా మారింది నామినేషన్ల ప్రక్రియ. ఆ...