Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: వేసవిలో ఏపీ రాజకీయం వేడెక్కబోతోందట.!

‘కొత్త ప్రభుత్వం పనితీరుపై ఏడాది వరకూ పూర్తిస్థాయిలో ఓ అవగాహనకు రాలేం..’ అని ఇంకా కొందరు బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.. రాష్ర్‌టంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గురించి కామెంట్‌ చేయడానికి. మరికొందరు మాత్రం, నేరుగానే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వేసవి కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం విపరీతమైన వేడిని సంతరించుకోబోతోందట.

మే నెలలో అనేక రాజకీయ మార్పులు సంభవిస్తాయని ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి లీకులు అందుతున్నాయి. ‘పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వుండాలి.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీజేపీ నేతలు తమ స్థాయిలో యాక్టివ్‌ అవ్వాల్సిందే..’ అనే సంకేతాలు ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ‘ఇప్పటిదాకా వైసీపీని భుజాన వేసుకున్నది చాలు..’ అంటూ వైసీపీ మద్దతుదారులుగా వున్న బీజేపీ నేతలకీ, ‘ఇకపై టీడీపీ పట్ల సానుకూలంగా వుంటే కుదరదు..’ అని టీడీపీ పట్ల సానుకూలంగా వున్న బీజేపీ నేతలకీ బీజేపీ అధిష్టానం నుంచి ఏకంగా శ్రీముఖాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది.

ఆయా నేతలెవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘జనసేనతో కలిసి ప్రయాణం చేయబోతున్నాం.. ఆ దిశగానే రెండు పార్టీలకు చెందిన నేతల రాజకీయ ప్రకటనలుండాలి.. జనసేన పార్టీతో అస్సలేమాత్రం పొలిటికల్‌ గ్యాప్‌ వుండకూడదు..’ అని ఓ బీజేపీ ముఖ్య నేతకు సున్నితమైన వార్నింగ్‌ కూడా ఢిల్లీ నుంచి అందిందట.

రానున్న రోజుల్లో బీజేపీ, ఏపీలో బలపడాల్సిందేననీ, అందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుని ఢిల్లీకి రావాల్సిందిగా కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలోని బీజేపీ ముఖ్య నేతలకు అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరున ఏపీ బీజేపీ నేతలతోపాటు, జనసేన ముఖ్య నేతలతో బీజేపీ అధిష్టానం కీలకమైన భేటీ నిర్వహించనుందని సమాచారం. అయితే, వేసవిలో రాజకీయం వేడెక్కడానికి సంబంధించి.. ఎలాంటి అనూహ్య మార్పులుంటాయన్నదానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

జగన్ ఏడాది పాలన: సంక్షేమం సరే.. అభివృద్ధి మాటేంటి?

అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది మే 30న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో...

ఇస్మార్ట్ భామకు బాగా బోర్ కొడుతోందిట

ఇస్మార్ట్ శంకర్ తో నభ నటేష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో నటన పరంగానే కాకుండా వడ్డించిన గ్లామర్ విందుకు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ నభ కెరీర్...

మిడతల దండుతో విమానాలకూ ప్రమాదమే.. ఎలాగంటే

కరోనాతో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య భయపెడుతోంది. దేశం యావత్తూ చర్చనీయాంశమైన ఆ అంశమే ‘మిడతల దండు’. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా.. వంటి రాష్ట్రాల్లో వీటితో పంట...

హైకోర్టులో షాకుల మీద షాకులు.. ఎందుకిలా?

ఏపీ సర్కారుకు హైకోర్టులో షాకుల మీదు షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ ఇన్ని ఎదురుదెబ్బలు తగల్లేదనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. జగన్ అధికారం చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ...

ప్రపంచ అత్యంత వయో వృద్దుడు మృతి

ప్రపంచంలోనే అతి పెద్ద వయసు వ్యక్తిగా బాబ్‌ వెయిటన్‌ రికార్డు సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన చిటెట్సు మృతి చెందడటంతో అత్యంత వృద్దుడిగా అధిక వయసు కలిగిన వ్యక్తిగా బాబ్స్‌...