Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: 3 రాజధానులు.. వైఎస్‌ జగన్‌ పరిస్థితేంటి.?

దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల్ని ప్రకటించేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక మెజార్టీని ప్రజలు కట్టబెట్టారనీ, 151 మంది ఎమ్మెల్యేల బలం వున్న తమ పార్టీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలదనీ, ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా శిరసావహించాలనీ ‘రాచరిక’ ఆలోచనని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెరపైకి తెచ్చారు.

ఏ విషయంలో అయినా, వైఎస్‌ జగన్‌ ఆలోచనలు ఇలానే వుంటున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయం అన్న ‘నైతిక సూత్రాన్ని’ ఆయన పాటించడంలేదు. ‘నేను ముఖ్యమంత్రిని కాబట్టి, రాష్ట్రానికి మూడు రాజధానులు పెడతా.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కులం పేరుతో దూషిస్తా.. శాసన మండలిని రద్దు చేస్తా..’ అంటే ఎలా కుదురుతుంది.?

రేప్పొద్దున్న ఇంకొకాయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు.. మూడు కాదు, ముప్పÛయ్‌ రాజధానులని చెబుతారు.. ఒప్పుకుంటామా.! ఛాన్సే వుండదు. మూడు రాజధానుల వ్యవహారం శాసన మండలి దగ్గర ఆగింది. కానీ, తమకున్న విశేషాధికారాలతో (అన్నట్టు, విశేషాధికారాలన్న పదం ముఖ్యమంత్రిగారికి నచ్చదండోయ్‌..) కర్నూలుకి కొన్ని ముఖ్యమైన కార్యాలయాల్ని తరలించాలని వైఎస్‌ జజగన్‌ నిర్ణయించేశారు. కానీ, హైకోర్టు మొట్టికాయలేసింది.. ఆ ప్రయత్నానికి బ్రేకులేస్తూ తాజాగా తీర్పునిచ్చింది.

ప్రభుత్వం జారీ చేసిన జీవోని కొట్టి పారేసింది. ఇదొక్కటే కాదు, ఇంగ్లీషు మీడియం విషయంలోనూ హైకోర్టు, ప్రభుత్వానికి మొట్టికాయలేసిన విషయం విదితమే. ఈ మొట్టికాయల లిస్ట్‌ చాలా పెద్దదే వుంటుంది. అందులో, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల ఎపిసోడ్‌ కూడా వుంది. మొన్నటికి మొన్న స్థానిక ఎన్నికల వాయిదాని ప్రశ్నిస్తూ, జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళితే, అక్కడా పరిస్థితులు అనుకూలించలేదాయె.

ఒకదాని తర్వాత ఒకటి షాక్‌లు తగులుతోంటే, ఇంకెవరన్నా అయితే ఆత్మవిమర్శ చేసుకుంటారు. కానీ, ఇక్కడ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మరింత అహంకారం ప్రదర్శిస్తున్నారు. పాలకుడికి అహంకారం ఎక్కువైతే, ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది. అన్నట్టు, కర్నూలు వ్యవహారంలోనే ప్రభుత్వానికి పరిస్థితులు అనుకూలించనప్పుడు, విశాఖకు అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌ని తరలించడానికి పరిస్థితులు ఎలా అనుకూలిస్తాయట.? అంటే, ఇంకో మొట్టికాయకి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధమయిపోయినట్లే.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్‌ స్టోరీ: చిరంజీవిపైకి బాలయ్యను ఎగదోస్తున్నదెవరు.?

మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ సినీ పరిశ్రమలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకోసం ఏర్పాటయిన విషయం విదితమే. పలువురు సినీ ప్రముఖులు ఈ బృహత్‌ కార్యక్రమానికి చిరంజీవి...

భారత్ – ఆస్ట్రేలియా బంధాన్ని బలోపేతం చేస్తున్న ‘సమోసా’

ఒక సమోసా రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సమోసా.. ఏంటి దేశాల మధ్య స్నేహం ఏంటి.. అనుకుంటున్నారా. ఇది నిజమే. భారతీయ చిరుతిండి (స్నాక్) సమోసా ఆస్ట్రేలియా ప్రధానిని...

అనుమతులు ఇవ్వటమే ఆలస్యం..’లొకేషన్’లో ఉంటాను.!

తమిళ నటుడు మరియు నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీని స్టార్ గా మార్చిన బ్లాక్ బస్టర్ సూపర్ చిత్రం ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా రిలీజై సెన్షేషనల్ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమా...

బాలయ్య కోసం మొదటి టఫ్ టాస్క్ ఫినిష్ చేసిన బోయపాటి శ్రీను

నందమూరి బాలకృష్ణ కెరీర్లో 'సింహా ', 'లెజెండ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో చేస్తున్న మూడవ సినిమా మార్చిలో మొదలై 13 రోజుల షూటింగ్ ని...

శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం..

తిరుపతి: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు. జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి....