Switch to English

గుండె పగిలింది: వరల్డ్‌ కప్‌లో కుప్పకూలిన కోహ్లీ సేన!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఒకదాని తర్వాత ఇంకోటి.. కళ్ళు చెదిరే విజయాల్ని వరల్డ్‌ కప్‌లో సాధిస్తోంటే, భారత క్రికెట్‌ అభిమానుల ఆనందం ఆకాశాన్నంటడం సహజమే. ఎక్కడా ఎలాంటి అనుమానమూ రాలేదు. ఇదే దూకుడు ప్రదర్శిస్తే కప్పు ఈసారి మనదే.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న చర్చ అంతటా జరిగింది. అత్యద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్‌ టీమిండియా సొంతం. మైదానంలో నిప్పులు చెరిగే బౌలర్లూ మెన్‌ ఇన్‌ బ్లూలో వున్నారు. న్యూజిలాండ్‌తో లీగ్‌ దశలో జరగాల్సిన మ్యాచ్‌ కాస్తా వర్షార్పణం కావడంతో చెరో పాయింట్‌ వచ్చింది. సెమీస్‌లో మళ్ళీ న్యూజిలాండ్‌తో తలపడే అవకాశం రావడంతో, టీమిండియా గెలుపుకి ఢోకా లేదని అంతా భావించారు.

ఇక్కడా వర్షం టీమిండియాకి షాకిచ్చింది. అయితేనేం, తక్కువ స్కోర్‌కే న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయగలిగారు భారత బౌలర్లు. ఒక రోజు జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌ డేకి పొడిగించబడింది. 239 పరుగలకు న్యూజిలాండ్‌ ఆలౌట్‌ అయితే, భారత బ్యాటింగ్‌ లైనప్‌ స్ట్రాంగ్‌గా వుంది గనుక.. గట్టిగా 35 ఓవర్లలోనే టీమిండియా గెలిచేస్తుందని అభిమానులు భావించారు. బెట్టింగులు కూడా ఆ దిశగా జరిగాయి. కోట్లలో బెట్టింగులు జరగడం గమనార్హం. కానీ, అందరి అంచనాల్ని తల్లకిందులు చేసింది టీమిండియా. 1, 1 ,1.. ఇదీ టీమిండియా టాప్‌ ఆర్డర్‌ పరిస్థితి. ఓపెనర్లు లోకేష్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ మాత్రమే కాదు.. టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ కూడా ఒక్క పరుగుకే పెవిలియన్‌ బాట పట్టాడంటే పరిస్థితి ఎంత ఛండాలంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

పిచ్‌ కండిషన్‌ని అర్థం చేసుకోలేనంత అనుభవ హీనులా మన బ్యాట్స్‌మెన్‌ అని ఇప్పుడంతా చీదరించుకుంటున్నారంటే.. వారి ఆవేదనలో అర్థం వుంది. చివర్లో ధోనీ, జడేజా టీమిండియాని ఆదుకున్నారు. దాంతో గౌరవప్రదమైన స్కోర్‌ చేసినా, వరల్డ్‌ కప్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది టీమిండియా. లీగ్‌ దశలో సమీకరణాలు కుదరక ఓడిపోతే అదో లెక్క. సెమీఫైనల్‌లో పోరాడి ఓడితే మరో లెక్క. కానీ, ఇంత దారుణంగానా.? న్యూజిలాండ్‌ బౌలింగ్‌ అద్భుతంగా వుందనడం కంటే, మనోళ్ళ చెత్త బ్యాటింగ్‌ కారణంగానే టీమిండియా ఓడిపోయిందనడం సబబు.

టాప్‌ త్రీ బ్యాట్స్‌మెన్‌ ఒక్కో పరుగు చేసి ఔట్‌ అయితే, రిషబ్‌ పంత్‌ కావొచ్చు, హార్దిక్ పాండ్య కావొచ్చు.. వాళ్ళయినా ఎందుకు నిలకడగా ఆడతారు.? కొద్ద గొప్పో వీళ్ళిద్దరూ ఫర్వాలేదన్పించారుగానీ, వారినీ క్షమించడానికి వీల్లేదిక్కడ. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నారు ఈ ఇద్దరూ. ఏదిఏమైనా వరల్డ్‌ కప్‌లో టీమిండియా కథ ముగిసింది. అదీ అత్యంత దారుణంగా. గెలిస్తే నెత్తిన పెట్టుకోవడం, ఓడితే.. చీల్చి చెండాడడం మామూలే అయినా.. కోహ్లీ సేన, సెమీస్‌లో ప్రదర్శించిన ఆటతీరుకి ఎంతలా విమర్శించినా తక్కువే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...