Switch to English

ఇండియా లాక్‌ డౌన్‌.. వేరే మార్గం లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

‘చేతులు జోడించి చెబుతున్నా.. ఈ రోజు అర్థరాత్రి నుంచి మీ ఇంటి చుట్టూ లక్ష్మణ రేఖ గీసుకోండి.. అందులోంచి బయటకు రావొద్దు..’ ఇదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం చేసిన సంచలన ప్రకటన. సుదీర్ఘంగా ఆయన దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం నిండా, దేశ ప్రజల పట్ల ఆయనలోని బాధ్యత కన్పించింది. ‘ప్రధానిగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నాను..’ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలిప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ప్రధాని మోడీ చెప్పిన మాట ముమ్మాటికీ నిజం. పరిస్థితి తీవ్రతను గుర్తించి, ప్రభుత్వాలు అప్రమత్తం చేసినా.. విదేశాల నుంచి వచ్చినవారిలో కొందరు నిర్లక్ష్యం చేశారు. ఆ కొందరి నిర్లక్ష్యం ఇప్పుడు దేశానికి శాపంగా మారింది.

తొలుత మార్చి 31 వరకు అనుకున్న లాక్‌ డౌన్‌ కాస్తా, ఇప్పుడు ఏప్రిల్‌ 14 వరకూ పొడిగింపబడింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్‌డౌన్‌ ప్రకటించుకోవడం ఓ ఎత్తు, దేశమంతా లాక్‌ డౌన్‌ అవడం ఇంకో ఎత్తు. ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించినా, కొందరు ప్రజలు లెక్క చేయకపోవడం ఇంతటి కరిన నిర్ణయానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా జనం రోడ్ల మీదకు రావడం మానలేదు. ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది.

ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ లాక్‌ డౌన్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, దీనికి మించిన వేరే దారి లేదు. అయితే, ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల మరింత బాధ్యతతో మెలగాలి. రాష్ట్రాలకు తగు సూచనలు మాత్రమే కాదు, తగినన్ని నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. ప్రభుత్వాల బాధ్యత కంటే ఇక్కడ ప్రజల బాధ్యత కీలకం. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ ‘చేతులు జోడించి’ వేడుకున్నారు. ఇది ప్రధాని ఆదేశంలా కాకుండా, మన ఇంటి పెద్ద మనకి చేసిన సూచనగా, సున్నితమైన హెచ్చరికగా మాత్రమే భావించాలి. సాటి మనిషిని కాపాడుకుందాం.. ఇంట్లోనే వుందాం.. కరోనాని దేశం నుంచి తరిమికొట్టేద్దాం.

2 COMMENTS

  1. 221977 80225Can I just say what a relief to search out somebody who genuinely is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a difficulty to light and make it crucial. Extra folks need to have to learn this and perceive this facet with the story. I cant consider youre no a lot more common because you positively have the gift. 319788

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...