Switch to English

కరోనా అలర్ట్‌: చుట్టాలొస్తున్నారు జాగ్రత్త.!

దేశంలోనే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి కరోనా వైరస్‌ కారణంగా. ఇప్పుడిప్పుడే వలస కూలీల్ని తమ సొంత ప్రాంతాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

మరోపక్క, విదేశాల నుంచి కూడా ‘చుట్టాల రాక’ మొదలైంది. కేరళకు ఇప్పటికే తొలి దఫాలో కొందరు వచ్చారు. వివిధ దేశాల నుంచి వస్తోన్న వీరంతా, దేశం కాని దేశంలో కరోనా వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడ్డవారే. వాళ్ళంతా మనవాళ్ళే. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. కరోనా వైరస్‌ దెబ్బకి ఇరుగిల్లు.. పొరుగిల్లు వైపు చూసేందుకూ ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది.

అయితే, ఇతర దేశాల నుంచి వస్తోన్న మనవారితో పెద్దగా ఇబ్బందులు వుండవని కేంద్ర రాష్ట్రాలు భరోసా ఇస్తున్నాయి. స్వదేశానికి రాగానే, వారికి స్క్రీనింగ్‌ వుంటుంది. అనుమానితులకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. క్వారంటైన్‌లో కూడా వుంచుతారు. ఇందు కోసం ‘పెయిడ్‌ క్వారంటైన్‌’ని కూడా కేంద్ర రాష్ట్రాలు పరిశీలిస్తుండడం గమనార్హం.

అటు విదేశాల నుంచి వస్తున్నవారు.. ఇటు రాష్ట్రాల మధ్య అట్నుంచి ఇటు.. ఇట్నుంచి అటు వెళుతున్నవారి కారణంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు ముందు ముందు మరింత పెరగనున్నాయన్నది నిర్వివాదాంశం. అయితే, అలా వెళుతున్నవారందరికీ క్వారంటైన్‌ తప్పనిసరి గనుక.. కేసులు పెరిగినా, ‘వ్యాప్తి’ మరీ ఎక్కువగా వుండకపోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా వుంటే, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 60 వేల మార్క్‌ దాటేసింది. 50 వేల నుంచి 60 వేలకు చాలా వేగంగా కేసులు పెరిగిన దరిమిలా, ఈ కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. గత కొద్ది రోజులుగా సగటున దేశంలో 3 వేలకు పైగానే ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతుండడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా గడచిన కొద్ది రోజుల్లో బాగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండడం గమనార్హం.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

క్రైమ్ న్యూస్: ప్రియురాలిని ఎర వేసి చెల్లి ప్రియుడిని చంపేసిన..

తన చెల్లిని ప్రేమించాడు అంటూ 19 యేళ్ల దినేశ్‌ను వంశీ చంపేశాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సంఘటన జరిగింది. హరీష్‌ పేటకు చెందిన దినేశ్‌ కొన్నాళ్లుగా సంధ్యను ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ...

అత్యాచార ఘటనపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా...

లైవ్ విజువల్స్: బెంగాల్, ఒడిశా, విశాఖలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అంపన్ తుఫాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొదలైన అంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ భీభత్సం నేడు విశాఖ తీరం మరియు కాకినాడ తీరప్రాంతాల్లోనూ దాడి చేయడం మొదలు...