స్వదేశంలో టీమిండియాకి తిరుగులేదని మరోమారు ప్రూవ్ అయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ టీమిండియా దుమ్ము రేపితే, అన్ని విభాగాల్లోనూ సౌతాఫ్రికా చేతులెత్తేసింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ని 3-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకోవడం గమనార్హం. సౌతాఫ్రికాపై ఇదే టీమిండియాకి అతి పెద్ద విన్‌గా చెప్పుకోవచ్చు.
చివరి రెండు టెస్టుల్లోనూ టీమిండియా, సౌతాఫ్రికాని ఫాలోఆన్ ఆడించి మరీ.. ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం గమనార్హం. 8 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా, నాలుగో రోజు కనీసం ఓ పది పదిహేను ఓవర్లయినా ప్రతిఘటిస్తుందనుకుంటే.. మ్యాచ్ ప్రారంభమయిన కాస్సేపటికే చాప చుట్టేసింది. మొత్తంగా ఈ టెస్ట్ సిరీస్ టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సత్తా చాటడానికేనా.? అన్నట్టు సాగడం గమనార్హం.
సెంచరీలే కాదు, డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు ఈ టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ. వన్డేల్లోనూ, టీ20ల్లోనూ దుమ్ము రేపే రోహిత్ శర్మ, టెస్టుల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా.. తన చోటుని టెస్టుల్లో ఇప్పటిదాకా పదిలం చేసుకోలేకపోయాడు. కానీ, ఇకపై ఆ మాటకు ఆస్కారం లేదు. నిఖార్సయిన టెస్ట్ ప్లేయర్.. అనదగ్గ రీతిలో రోహిత్ శర్మ రాణించాడు మూడు టెస్ట్ మ్యాచ్‌లలోనూ.
ప్రత్యర్థి బౌలర్లపై ఎటాకింగ్ గేమ్ ఆడటంలో వీరేందర్ సెహ్వాగ్‌ని తలపించాడు రోహిత్ శర్మ. మరోపక్క, భారత బౌలర్లలో దాదాపుగా అందరూ రాణించడం గమనించదగ్గ విషయం. ఇదిలా వుంటే, కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టెస్ట్ సిరీస్ గెలుపు చాలా చాలా ప్రత్యేకం.
24671 898835Wonderful paintings! That is the kind of information that should be shared around the web. 519161
529296 761000conclusion that you are definitely right but several call for to be 373886
990502 690069I need to have to admit that that is 1 fantastic insight. It surely gives a company the opportunity to have in about the ground floor and genuinely take part in creating a thing unique and tailored to their needs. 249849