ప్రస్తుతం ఇండియా, పాక్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. రాత్రి అయితే చాలు దాయాది పాక్ దొంగ దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఆర్మీ అధికారులు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు సైరన్ మోగిస్తూ.. ప్రజలను అలెర్ట్ చేస్తోంది. దాడులకు ఏ మాత్రం అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు అంటే ప్రభుత్వం ఏది చెప్పాలనుకున్నా.. అధికారుల ద్వారా మాత్రమే చెప్పించేది. ఇప్పుడు అలా కాదు కదా. అందుకే మీ ఫోన్ లో కూడా ఎమర్జెన్సీ అలెర్ట్ ను ఆన్ చేసి పెట్టుకోవాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. భూకంపాలు, ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు వచ్చినప్పుడు మీ ఫోన్లకే ప్రభుత్వాలు అలెర్ట్ మెసేజ్ లు పంపిస్తుంది. మీ ఫోన్ లో నెట్ వర్క్ లేకపోయినా మెసేజ్ లు వస్తాయి. దాంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు.
ఆపద పరిస్థితుల్లో ప్రజలను అలెర్ట్ చేసేందుకు, వారిని కాపాడేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లలో ఈ అలెర్ట్ ను ఎప్పుడూ ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే అపాయం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ప్రభుత్వం పంపే అలెర్ట్ మెసేజ్ లు మనకు రాకుండా ఉంటాయి. అందుకే మీ ఫోన్ లో ఈ అలెర్ట్ డిజేబుల్ చేసి ఉంటే వెంటనే ఎనేబుల్ చేసుకోండి.
ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఆండ్రాయిడ్ ఫోన్ లో..
మొబైల్ లోని సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయాలి
సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్‌ను టాప్(TAP) చేయాలి
ఒకవేళ మీకు కనిపించకపోతే ఎమర్జెన్సీ అలెర్ట్స్ అని సెర్చ్ చేయొచ్చు.
వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఐఫోన్ మొబైల్స్ లో..
ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
నోటిఫికేషన్స్‌కు ఆప్షన్ కు వెళ్లాలి
గవర్నమెంట్ అలర్ట్స్ ను ఆన్ చేయాలి.
