తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా రాణించిన గోవా బ్యూటీ ఇలియానా ఆసుపత్రిలో చేరింది. ఇటివల ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆసుపత్రిలోని బెడ్ పై తాను ఉన్న ఫొటోలను షేర్ చేసింది. వైద్యులు మంచి వైద్యం అందించారని.. కోలుకుంటున్నట్టు వెల్లడించింది. ఈమేరకు ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
ఒక రోజు నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరాను. డాక్టర్లు సెలైన్స్ పెట్టారు. చక్కటి వైద్యం అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాను. నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ఉందని మీరంతా మెసేజెస్ చేస్తున్నారు. ఇంత ప్రేమ పొందుతున్న నేను అదృష్టవంతురాలిని. మీ అభిమానానికి కృతజ్ఞురాలు’ అని రాసుకొచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మెసేజెస్ చేస్తున్నారు. ఇటివల ది బిగ్ బుల్ సినిమాలో నటించిన ఇలియానా ప్రస్తుతం అన్ ఫెయిర్ అండ్ లవ్లీ సినిమాలో నటించింది.