మన దర్శకురాలికి సూపర్‌ స్టార్‌ ఛాన్స్‌

మన దర్శకురాలికి సూపర్‌ స్టార్‌ ఛాన్స్‌

దర్శకురాలు సుధా కొంగర కొందరికి మాత్రమే తెలుసు. ఆమె తెలుగులో పలు చిత్రాలకు పని చేసినా కూడా ఆమె పేరు మాత్రం పెద్దగా పబ్లిసిటీ కాలేదు. కారణం మన తెలుగు సినిమా పరిశ్రమ పురుషాధిక్యం కలిగిన ఇండస్ట్రీ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చేసిన సినిమా హిట్‌ అయినా కూడా ఆమెకు పెద్దగా పేరు వచ్చేందుకు హీరోు ఇష్టపడరు. తెలుగు అమ్మాయి అయినా కూడా తెలుగు వారు పట్టించుకోకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి పోయింది.

అక్కడ వరుసగా చిత్రాలు తెరకెక్కిస్తూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంది. తాజాగా ఈమె సూర్య హీరోగా సినిమాను తెరకెక్కిస్తోంది. ఆ సినిమా విడుదల కాకుండానే కొన్ని సీన్స్‌ చూసిన తర్వాత తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ ఆమెతో వర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపించాడట. ప్రస్తుతం చేస్తున్న మాస్టర్‌ చిత్రం పూర్తి అయిన వెంటనే సుధ కొంగర దర్శకత్వంలో విజయ్‌ మూవీ ఉండబోతుందట.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. స్టోరీ లైన్‌ కూడా అప్పుడే రెడీ అయ్యిందట. స్టోరీ లైన్‌కు ఫిదా అయిన విజయ్‌ సినిమాను చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడట. ఇదే ఏడాదిలో విజయ్‌ మరో దర్శకుడితో సినిమా చేయాల్సి ఉంది. కాని ఆ సినిమాను ఆపేసి సుధ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. మొత్తానికి మన హీరోలు ఆమెను పట్టించుకోకున్నా తమిళ స్టార్‌ హీరోలు ఆమెలోని ప్రతిభను గుర్తించి ఆఫర్లు ఇస్తున్నందుకు సగటు తెలుగు వాళ్లు సంతోషిస్తున్నారు.