Switch to English

చైన్ తెగనంత కాలం.. చేసేదేమీ లేదు

ప్రాణాంతక కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. దీనికి మందు లేకపోవడంతో ఈ వైరస్ ను అడ్డుకోవడం కత్తి మీద సాముగానే మారింది. కరోనా సోకినవారికి అందుబాటులో ఉన్న మందులు వేసి, వ్యాధి నిరోధకత శక్తి పెంచే ఆహారం అందించి ఎలాగోలా నయం చేయడానికి డాక్టర్లు నానా తంటాలూ పడుతున్నారు. వివిధ దేశాలు భారీస్థాయిలో ఆర్థిక నష్టాన్ని భరిస్తూ లాక్ డౌన్ పాటిస్తున్నాయి.

పల్లెల్లో లాక్ డౌన్ ను బాగానే పాటిస్తున్నా.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఇది ఆశించినంతగా అమలుకావడంలేదు. ముఖ్యంగా గురువారం హైదరాబాద్ లో జనాలు రోడ్లపైకి మామూలు స్థాయిలో వచ్చేశారు. బ్యాంకుకు అనో, మెడికల్ ఎమర్జెన్సీ అనో, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనో రకరకాల కారణాలు చెబుతున్నారు. బైక్ పై ఒకరికి మించి వెళ్లకూడదనే నిబంధనను సైతం చాలామంది పట్టించుకోవడంలేదు.

వాస్తవానికి కరోనా లింకు తెగ్గొట్టడమే లాక్ డౌన్ ఉద్దేశం. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సులభంగా సోకుతుందనే సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తిని కాంటాక్ట్ అయినవారికి ఇది సోకే ప్రమాదం ఉంది. ఆ వ్యక్తికి సమీపంగా ఉన్నా, అతడు వినియోగించిన వస్తువులు ముట్టుకున్నా వైరస్ సోకే ఛాన్స్ ఉంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి.. అతడి నుంచి ఇంకొకరికి ఓ చైన్ తరహాలో ఇది సోకుతూ వెళుతుంది.

ఈ నేపథ్యంలో పాజిటివ్ వ్యక్తుల నుంచి కొనసాగే లింక్ ను ఆపడానికే ప్రభుత్వాలు లాక్ డౌన్ తీసుకొచ్చాయి. దీని వల్ల జనాలు ఎవరూ బయటకు రాకుండా ఉంటారని, ఫలితంగా పాజిటివ్ ఉన్నవ్యక్తుల నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశం ఉండదని భావించారు. లాక్ డౌన్ నిబంధనలు పక్కాగా అమలైతే.. ఇప్పటికే వైరస్ సోకినవారు, వారి నుంచి ఈ మహమ్మారి అంటించుకున్నవారు 14 రోజుల్లో బయటపడతారు. అలాంటివారిని గుర్తించి క్వారంటైన్ చేయడం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. ఈ ఉద్దేశంలోనే 21 రోజుల లాక్ డౌన్ కేంద్రం ప్రకటించింది. అయితే, ఈ కాలంలో భారీగా కేసులు నమోదు కావడంతో మరో 19 రోజులపాటు పొడిగించింది.

ఇప్పటికైనా లాక్ డౌన్ నిబంధనలు పక్కాగా అమలైతే.. ఈ వైరస్ చైన్ తెంపడం వీలువుతుంది. చివరి కేసు నమోదైన తర్వాత కనీసం 14 రోజులపాటు లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తే.. వైరస్ ముప్పును తొలగించుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. కానీ 23 రోజులుగా ఇంటిపట్టునే ఉన్న జనం.. తాజాగా రోడ్లపైకి వచ్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది చాలా సిల్లీ కారణాలతో రోడ్డెక్కడం కనిపిస్తోంది. ఇదే జరిగితే కరోనాను అరికట్టడం ఇప్పట్లో సాధ్యం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కట్టుదిట్టంగా లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

అత్యాచార ఘటనపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను కలిగించేలా సినిమా ఆఫీస్‌ లను ఫిల్మ్‌...

ఇండియాలో అక్కడ మాత్రమే కరోనా లేదు

ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్‌ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం...