సమంత ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ హనీ-బన్నీ అమేజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ పర్వాలేదనిపిస్తోంది. ఈ క్రమంలోనే సమంత ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. సౌత్ ఇండియాలో కేవలం సమంత వల్లే బిజినెస్ జరిగిందని చెప్పుకోవాలి. అయితే చైతూ-శోభిత ఎంగేజ్ మెంట్, మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్ల నేపథ్యంలో ఆమె అప్పుడప్పుడూ స్పందిస్తోంది. ఈ క్రమంలోనే సిటాడెల్ లో తాను చేసిన తల్లి పాత్ర గురించి ఆమె తాజాగా మాట్లాడింది. ఆ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందంటూ వివరించింది.
దాంతో నాకు కూడా తల్లి కావాలని అనిపిస్తోంది. అమ్మగా ఉండేందుకు నేను ఇష్టపడుతా. కాకపోతే దానికి లేట్ అయిందని నేను అనుకోవట్లేదు. సిటాడెల్ సినిమాలో తన కూతురుగా నటించిన కశ్మీ మంజ్ముందర్ అద్భుతంగా చేసిందంటూ తెలిపింది. ఆమె అన్ని రకాల హావభావాలను పలుకుతోంది అంటూ చెప్పుకొచ్చింది సమంత. దాంతో ఆమె తల్లి కావాలంటూ చేసిన కామెంట్స్ పై చర్చ మొదలైంది. ఈ లెక్కన ఆమె మరో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగూ నాగచైతన్య కూడా రెండో పెళ్లి చేసుకుంటున్నాడు.
కాబ్టటి ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకున్నా పెద్దగా తప్పుబట్టేవారు ఉండరు. అలా కాకుండా సమంతనే ముందుగా పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమెను దారుణంగా విమర్శించేవారేమో అంటున్నారు ఆమె అభిమానులు.