మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబంతో పాటు.. టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, ప్రతి ఒక్కరూ ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో ఆమె తన వ్యాఖ్యలపై స్పందించారు. తాను అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. మంత్రి కేటీఆర్ తనపై చేయిస్తున్న అసభ్యకరమైన ట్రోలింగ్ ను తట్టుకోలేక ఆవేదనలో అనుకోకుండా అలా మాట్లాడినట్టు ఆమె విరించారు.
ఈ రోజు ఆమె హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. తాను కేటీఆర్ ను విమర్శిస్తూ అనుకోకుండా ఓ కుటుంబం గురించి మాట్లాడినట్టు తెలిపారు. తన వ్యాఖ్యలతో ఆ కుటుంబం బాధపడిందన్నారు. ఆ కుటుంబం చేసిన పోస్టులను చూసి తాను అత్యంత బాధపడినట్టు చెప్పారు. ఈ విషయంలో తాను వెంటనే పోస్టు చేశానని.. ఇప్పుడు మీడియా ముఖంగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ఆమె వివరించారు. అయితే ఈ విషయంలో కేటీఆర్ ను మాత్రం వదిలేది లేదని ఆమె తేల్చి చెప్పారు. కేటీఆర్ చేసిందంతా చేసి.. తనను నిందించడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
ఈ విషయంలో లీగల్ గానే పోరాడుతానని వివరించారు సురేఖ. ఇక టాలీవుడ్ లో మొత్తం ఆమె వ్యాఖ్యలపై సీరియస్ కావడంతో చివరకు కొండా సురేఖ ఇలా స్పందించారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేసి మరింత ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారే తప్ప ఆమెకు ఒరిగిందేమీ లేదు. ఈ విషయంలో కేటీఆర్ కే మేలు జరిగింది తప్ప.. ఆమెకు కాదని అంటున్నారు.