వివాహేతర సంబంధంతో ప్రియురాలి ఆనందం కోసం భార్యను కొడుతూ హింసిస్తున్న ఓ శాడిస్టు భర్త అరాచకాలు ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ప్రియురాలి ఆదేశాలతో తనను దారుణంగా కొడుతూ హింసిస్తున్నాడంటూ భార్య పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళకు రాబిన్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం పెళ్లయింది. అయితే.. కొన్నాళ్లుగా భార్యతో విడిగా ఉంటున్నాడు.
ఈక్రమంలో హరిపర్వత్ కు చెందిన ఓ మహిళతో రాబిన్ కు పరిచయం ఏర్పడింది. దీంతో భార్య దగ్గరకు రావడం మానేశాడు రాబిన్. ఎప్పుడైనా ఇంటికి వెళ్తే.. నీ భార్యను కొట్టు.. నేను వీడియో కాల్ లో చూస్తా అని ప్రియురాలు చెప్పడంతో అలానే చేసేవాడు రాబిన్. దీంతో ప్రియురాలు సంతోషించేది. రాబిన్ చర్యలతో విసుగెత్తిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రియురాలు, ఆమె తల్లి యువకులను మభ్యపెట్టి డబ్బులు కూడా వసూలు చేస్తారని.. వారిపై అత్యాచార కేసులు పెడుతూంటారని ఆరోపించింది.