Whale: సముద్రంలోకి ఓ చిన్న పడవలో తండ్రితో కలిసి వెళ్లిన యువకుడ్ని తిమింగలం నోట కరచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇంత వైరల్ అవడానికి మరో కారణం నోట కరచిన తిమింగలం యువకుడ్ని వెంటనే వదిలేయడం.. ఆ ఘటనను తండ్రి వీడియో తీయడం మరింత సంచలనం రేపుతోంది.
చిలీ సముద్ర జలాల్లోకి గత వారం పటగోనియా తీరంలోఆడ్రియన్ సిమన్ కాస్ అనే యువకుడు తండ్రి డెల్ తో కలిసి సరదాగా సముద్రంలో విహరించడానికి ఓ చిన్న పడవలో వెళ్లాడు. అయితే.. అనుకోని విధంగా వారికి హంప్ బ్యాక్ తిమింగలం ఎదురుపడింది. పసుపురంగు పడవ, ఎర్ర జాకెట్ వేసుకున్న యువకుడ్ని తిమింగలం పట్టేసింది.
ఆ సమయంలో పడవలో యువకుడు మాత్రమే ఉన్నాడు. సంఘటన జరుగుతూండగా తండ్రి వీడియో తీస్తూ.. భయపడొద్దంటూ కొడుకుని ఉద్దేశించి గట్టిగా కేకలు వేశాడు. తిమింగలం వదిలేయడంతో వీరు ఊపిరి పీల్చుకున్నారు. తమింగలం తనను మింగేస్తుందని భయపడ్డానని.. తిమింగలం వదిలేయడం కూడా ఆశ్చర్యపరిచిందని ఆడ్రియన్ అన్నాడు.
A humpback whale swallowed a 20-year-old man while he was packrafting with his father in Águila Bay, Punta Arenas, Chile, then spat him out a few seconds laterpic.twitter.com/g1HxkfUGR5
— Massimo (@Rainmaker1973) February 13, 2025