ఏపీలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ లో పోస్టు చేస్తూ పోలీసులను అభినందించారు. అన్నమయ్య జిల్లాల్లో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్నారు. రూ.4.20 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, ఒక బైక్ ను కూడా సీజ్ చేశారు. బుధవారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది, పోలీసులు కలిసి నిర్వహించిన తనిఖీల్లో వీరిని పట్టుకున్నారు.
కారులో దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. పోలీసులను, ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సు అధికారులను అభినందించారు. తమ ప్రభుత్వం ఇలాంటి పనులను ఉక్కుపాదంతో అణచివేస్తుందని చెప్పారు. ఎర్రచందనం అరుదైన సంపద అని.. అలాంటి వాటిని కాపాడేందుకు ఫారెస్ట్ పోలీసులు, అధికారులు చేస్తున్న కృషిని ప్రశంసించారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరం కలిసి ఇలాంటి స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అణచివేస్తామని చెప్పారు. అటవీ సంపదను ఎవరు కొల్లగొట్టాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పవన్.