ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పలు అంతర్జాతీయ కంపెనీలతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎపిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, డేటా సెంటర్లు, క్రియేటర్ అకాడమీ వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

క్రియేటర్ అకాడమీ ఏర్పాటు: సింగపూర్ షాంగ్రీలా హోటల్‌లో టెజరాక్ట్ US Inc. ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఎపి ప్రభుత్వం ఐటి కార్యదర్శి కాటంనేని భాస్కర్ ల సమక్షంలో ఎంఓయూ కుదిరింది. ఈ క్రియేటర్ అకాడమీ ద్వారా కంటెంట్ తయారీకి శిక్షణ, వనరులు, సాంకేతిక సహాయం అందించబడనుంది. గూగుల్ సంస్థ పాఠ్యాంశాలు, సాంకేతిక మద్దతు అందిస్తే, టెజరాక్ట్ సంస్థ భౌతిక వసతులు, నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది.

విశాఖలో డేటా సిటీ & చిప్ డిజైనింగ్ కేంద్రం: గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్‌తో సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో డేటా సిటీకి అవసరమైన మౌలిక వసతులు పూర్తయినట్లు తెలిపారు. గూగుల్ చిప్ డిజైనింగ్ సెంటర్‌ను కూడా విశాఖలో ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, గూగుల్ లేదా దాని భాగస్వామి సంస్థలు ఎపిలో సర్వర్ సప్లై చైన్, రిపేర్ & మెయింటెనెన్స్ హబ్ స్థాపించవచ్చని అన్నారు.

ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు: మురాటా ఎలక్ట్రానిక్స్ ఎండి హిరోయికి నివాతో భేటీలో ఎపిలో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ స్థాపించాలని లోకేష్ ఆహ్వానించారు. ఎలక్ట్రానిక్స్ 4.0 పాలసీ కింద పలు ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తిరుపతి, విశాఖలో ఇప్పటికే పలు కంపెనీలు యూనిట్లు నెలకొల్పాయని, మురాటా వంటి సంస్థలు కూడా ఎపిలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్: క్యారియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాతో భేటీలో ఎపిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు HVAC సిస్టమ్స్ అమలు, టైర్-2, టైర్-3 నగరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల నిల్వ కోసం కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్: ఎస్.టి. టెలీమీడియా ఇన్వెస్టిమెంట్స్ ఇండియా హెడ్ రీతూ మెహ్లావత్‌తో భేటీలో విశాఖపట్నంలో గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. రీతూ మెహ్లావత్ ఈ ప్రతిపాదనను సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని తెలిపారు.

బిజినెస్ రౌండ్ టేబుల్ మీటింగ్: బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ:

ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఎఐ, ఫిన్‌టెక్ రంగాల్లో ఎపి పెట్టుబడులకు వ్యూహాత్మక కేంద్రం.

974 కి.మీ తీరప్రాంతం, పోర్టులు, ఎయిర్ కనెక్టివిటీ, విద్యా వనరులు ఉన్నాయని వివరించారు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్ 4.0 పాలసీని ప్రకటించామని చెప్పారు.

టిసిఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఎపిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు.

స్టార్టప్‌లను ప్రోత్సహించి, నాలెడ్జి బేస్డ్ ఎకానమీ సాధన లక్ష్యంగా గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

మంత్రి లోకేష్ మాట్లాడుతూ, “ఎపి వ్యాపార సౌలభ్యం, పారదర్శక విధానాలతో పెట్టుబడిదారులకు పూర్తి మద్దతు అందిస్తుందని” స్పష్టం చేశారు.

సినిమా

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

Tollywood: ‘జెట్లీ’ని ఆపారు.. ‘పెద్ది’ని కూడా ఆపుతారా..? నిర్మాత ఏమంటున్నారు..?

Tollywood: ప్రేక్షకులకు వినోదం అందించాలంటే చిత్రం ప్రదర్శన కావాలి. ప్రేక్షకాదరణకు నోచుకోవాలంటే ప్రదర్శన జరగాలి. అసలు దర్శక-నిర్మాతలు తీసే సినిమా ప్రదర్శన కావాలంటే ఉండాల్సింది ధియేటర్లు. అక్కడ ప్రదర్శన జరిగితేనే అంతిమ ఫలితాలు,...

Trisha: హీరోయిన్ ‘త్రిష’కు అవమానం..! కావాలనే చేశారా..!?

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు. 2002లో తమిళంలో సూర్యతో వచ్చిన మౌనం పెసియాదే నుంచి నేటి వరకూ ఆమె హీరోయిన్ గా రాణిస్తూనే ఉన్నారు. 24ఏళ్లుగా హీరోయిన్ గా సుదీర్ఘ...

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీ మధ్యలో వెలుగులోకి రావడం చిన్న...

Daily Horoscope: మిథున రాశివారికి కొత్త అవకాశాలు.. వృశ్చిక రాశివారికి ఆర్థిక లాభ సూచనలు

మే 7 , 2026 గురువారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించనుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు...